Priyanka Gandhi: మోదీపై ప్రియాంకా గాంధీ విమర్శలు.. ఏమన్నారంటే?

అప్పటి యూపీఏ ప్రభుత్వంపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు.

Priyanka Gandhi: మోదీపై ప్రియాంకా గాంధీ విమర్శలు.. ఏమన్నారంటే?

Priyanka Gandhi

Updated On : January 11, 2025 / 9:54 PM IST

రూపాయి మారకం విలువ పడిపోతున్న తీరును ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరుకుందని మండిపడ్డారు. శుక్రవారం తొలిసారిగా అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు క్షీణించి రూ.86.04కు చేరింది.

దీనిపై ప్రియాంకా గాంధీ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. “డాలర్‌తో రూపాయి విలువ జీవనకాల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ చరిత్రలో తొలిసారిగా 86.4 రూపాయలకు చేరింది” అని పేర్కొన్నారు.

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో ఒక డాలర్ విలువ రూపాయ మారకంతో పోల్చితే 58-59 రూపాయలుగా ఉన్నప్పుడు.. అప్పటి గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్రమోదీ రూపాయి విలువను ప్రభుత్వ ప్రతిష్ఠతో ముడిపెట్టేవారని ప్రియాంకా గాంధీ అన్నారు.

పదేళ్ల క్రితం అప్పటి యూపీఏ ప్రభుత్వంపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. తనకు అన్నీ తెలుసని, ఏ దేశ కూడా కరెన్సీ ఇంతలా పడిపోదని మోదీ అప్పట్లో అనేవారని తెలిపారు. కాగా, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతోంది. ఈ తీరు వాణిజ్య లోటుతో పాటు ద్రవ్యోల్బణం పెరిగేందుకు దారి తీస్తుంది.

Ponguleti Srinivas Reddy : వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు..!- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు..