Wayanad Lok Sabha bypoll: ప్రియాంకా గాంధీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
తన భర్త ఆస్తుల వివరాలను కూడా ఆమె వెల్లడించారు.

కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో తెలిపారు. తన ఆస్తుల విలువ రూ.12 కోట్లకు పైగా ఉన్నట్లు ప్రకటించారు.
తన వద్ద రూ.4.27 కోట్ల విలువైన చరాస్తులు ఉండగా, అందులో మూడు బ్యాంకు ఖాతాల్లో వివిధ మొత్తాల డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు, పీపీఎఫ్, హోండా సీఆర్‌వీ కారు ఉన్నాయని తెలిపారు. తన భర్త ఆస్తుల వివరాలను కూడా ఆమె వెల్లడించారు.
ప్రియాంక గాంధీ ఆస్తులు
- చరాస్తులు: రూ.4,24,78,689
- స్థిరాస్తులు: రూ.7,74,12,598
- మొత్తం ఆస్తులు: రూ. 11,98,91,287
- అప్పులు: రూ.15,75,000
- 2023-24లో చూపిన ఆదాయం: రూ. 15,09,220
రాబర్ట్ వాద్రా ఆస్తులు
- చరాస్తులు: రూ.37,91,47,432
- స్థిరాస్తులు: రూ.27,64,38,633
- మొత్తం ఆస్తులు: రూ. 65,55,86,065
- అప్పులు: రూ.10,03,30,374
- 2023-24లో చూపిన ఆదాయం: రూ.15,09,220
PM Modi: నరేంద్ర మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశం.. చైనా అధ్యక్షుడితో మోదీ ఏమన్నారో తెలుసా?