Priyanka Gandhi’s Children : ప్రియాంకా గాంధీ పిల్లల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్..!
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా పిల్లల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఇన్‌స్టా అకౌంట్ల హ్యాకింగ్‌కు సంబంధించి దర్యాప్తు చేయనున్నట్టు కేంద్రం పేర్కొంది.

Priyanka Gandhi's Children's Insta Hacked Charge To Be Probed Sources (1)
Priyanka Gandhi Children : కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా పిల్లల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి. ఇన్‌స్టా అకౌంట్ల హ్యాకింగ్‌కు సంబంధించి దర్యాప్తు చేయనున్నట్టు కేంద్రం పరిధిలోని ప్రభుత్వ అడ్వాన్స్‌డ్ యాంటీ సైబర్
క్రైమ్ యూనిట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రియాంకా గాంధీ ఆరోపణలతో కేసును హ్యాకింగ్ అకౌంట్లపై విచారించనున్నట్లు యాంటీ సైబర్ క్రైమ్ యూనిట్ పేర్కొంది. తమ పిల్లల ఇన్‌స్టా అకౌంట్లు హ్యాక్ అయినట్లు ప్రియాంకా గాంధీ ఆరోపించారు. మా
పిల్లల అకౌంట్లు ఎందుకు హ్యాక్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ కూడా ఆరోపించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రియాంకా తన పిల్లల ఇన్‌స్టా అకౌంట్ హ్యాకింగ్
వ్యవహారాన్ని కూడా లేవనెత్తారు.
ప్రభుత్వానికి ఏం పనులు లేవా.. విపక్షాల ఫోన్లను ట్యాప్ చేయడమేనా పని, ప్రజల కోసం పనిచేయరా అంటూ ప్రియాంకా సూటిగా ప్రశ్నించారు. అయితే తన పిల్లల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్ కావడంపై ప్రియాంకా గాంధీ ఎలాంటి ఫిర్యాదు
చేయలేదు. ప్రియాంకా గాంధీ ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఇన్ స్టా అకౌంట్ల హ్యాకింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (ICER) లేదా CERT-in అనేది ఎలక్ట్రానిక్స్
అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రం పరిధిలోకి వస్తుంది.
సైబర్ దాడులను అడ్డుకోవడంతో పాటు సైబర్ నేరగాళ్లను ట్రేస్ చేయడానికి CERT-in ఒక అడ్వాన్స్‌డ్ ల్యాబ్ రన్ చేస్తోంది. 2019 నవంబర్ నుంచే ఈ ఫోన్ కాల్ ట్రేసింగ్ వంటి వ్యవహారంపై రాజకీయ దుమారం రేపుతోంది. అప్పట్లో ప్రియాంకా గాంధీ సహా ముగ్గురు విపక్ష నేతల ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ అయినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే.
Read Also : Moto G Stylus : మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు లీక్..!