ప్రియాంక రోడ్ షో.. కిక్కిరిసిన రోడ్లు

ప్రియాంక రోడ్ షో.. కిక్కిరిసిన రోడ్లు

ప్రియాంక గాంధీ వాద్రా రోడ్ షో దేశ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. ఉత్తరప్రదేశ్  ఈస్టరన్‌కు జనరల్ సెక్రటరీగా నియమితురాలైన రెండు వారాల్లోనే రోడ్ షో మొదలుపెట్టడం అభిమానుల్లో, ప్రతిపక్షాల్లో ఆవిడ రాజకీయ ప్రస్తానంపై అంచనాలు పెరిగేలా చేస్తున్నాయి. రాజకీయంగా కెరీర్‌లోనే మొదటి రోడ్ షో కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. ప్రియాంక పాల్గొంటున్న ఈ రోడ్ షోలో సోదరుడు రాహుల్ గాంధీతో పాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇంఛార్జి జ్యోతిరాధిత్య సింధియా కూడా పాల్గొనుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 

సోమవారం ఉదయం రోడ్ షోలో పాల్గొనేందుకు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, జ్యోతిరాధిత్య సింధియా లక్నో చేరుకున్నారు. తాను గెలిచి ప్రతి ఒక్కరి గొంతును సభలో వినిపిస్తానని ప్రియాంక మాటిచ్చారు. ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ప్రియాంక ట్విట్టర్‌లో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన 15 నిమిషాల్లో 5వేల మంది గంటలో 25వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంక గేమ్ ఛేంజర్ కానున్నారని పార్టీ శ్రేణుల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది.