ED searches : రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లపై ఈడీ దాడులు
రాజస్థాన్ పేపర్ల లీక్ కేసులో నిందితులైన కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం దాడులు చేశారు. రాజస్థాన్ మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ హడ్లా నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు.....

Rajasthan-Congress-leaders
ED searches : రాజస్థాన్ పేపర్ల లీక్ కేసులో నిందితులైన కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం దాడులు చేశారు. రాజస్థాన్ మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ హడ్లా నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. పేపర్ల లీక్ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసులో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు చెందిన 11 ప్రాంతాల్లో సోదాలు చేశారు.
Also Read : Z category security : బీజేపీ లీడర్ బీఎస్ యెడియూరప్పకు జడ్ కేటగిరి సెక్యూరిటీ
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్, దౌసా, సికార్ ప్రాంతాల్లోని ఇద్దరు కాంగ్రెస్ నేతల నివాసాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలో నవంబర్ 25వతేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఆకస్మికంగా సోదాలు జరపడం విశేషం.
Also Read : Ground Water : భారతదేశంలో భూగర్భజలాల క్షీణతపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
పేపర్ల లీక్ కేసులో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు బాబులాల్ కటారా, మరో వ్యక్తి అనిల్ కుమార్ మీనాలను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఒక పక్క రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగుతుండగా మరో వైపు ఈడీ దాడుల పరంపర కొనసాగుతోంది.