Crackers Ban : ఢిల్లీలో టపాకాయలు అమ్మడం, కాల్చడంపై నిషేధం
ఢిల్లీలో ఈ ఏడాది కూడా టపాకాయలు కాల్చడం, నిల్వచేయడం, అమ్మడంపై నిషేధం విధించారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రమాదకర కాలుష్యం దృష్ట్యా నిషేధించినట్లు తెలిపారు.

Delhi (1)
Prohibition on firing of crackers : ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో టపాకాయలు కాల్చడం, నిల్వచేయడం, అమ్మడంపై నిషేధం విధించింది. ఈ ఏడాది కూడా టపాకాయలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో ప్రమాదకర కాలుష్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 3 సంవత్సరాలుగా దీపావళి సందర్భంగా ఫైర్ క్రాకర్స్ అమ్మకాలు, నిల్వలపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు.
గత సంవత్సరంలాగే, ఈ సంవత్సరం కూడా అన్ని రకాల పటాకుల నిల్వ, అమ్మకం, వినియోగంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుందన్నారు. కాలుష్య నియంత్రణ ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. గత సంవత్సరం వ్యాపారులు పటాకులు నిల్వ చేసిన తర్వాత కాలుష్యం తీవ్రత దృష్ట్యా, పూర్తి నిషేధం ఆలస్యంగా విధించబడిందని తెలిపారు.
Building Collapse:ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..శిథిలాల కింద ప్రాణాలు..!
ఇది వ్యాపారులకు నష్టాన్ని కలిగించిందన్నారు. వ్యాపారులు అందరూ ఈ ఏడాది పూర్తి నిషేధాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి క్రాకర్స్ నిల్వ చేయవద్దని సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.