అప్పట్లో దేవుళ్లపై ప్రకటన వివాదం : ఇప్పుడు బీజేపీలోకి!

  • Published By: vamsi ,Published On : April 22, 2019 / 02:19 PM IST
అప్పట్లో దేవుళ్లపై ప్రకటన వివాదం : ఇప్పుడు బీజేపీలోకి!

Updated On : April 22, 2019 / 2:19 PM IST

సెలబ్రిటీ హెయిర్‌ స్టైలిష్ట్ జావెద్ హబీబ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో బీజేపీ నేతలు జావెద్ హబీబ్‌కు కాషాయ కండువా కప్పి జావెద్ హబీబ్‌ను పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నేతలు. జావెద్ హబీబ్ ప్రపంచంలో ఉన్న ది బెస్ట్ హెయిర్‌ స్టైలిస్ట్‌లలో ఒకరు. జావెద్ హబీబ్‌కు 3 అంతర్జాతీయ స్థాయి సెలూన్లు ఉండగా భారత్‌లో వివిధ ప్రాంతాల్లో 550 హెయిర్‌ సెలూన్లు ఉన్నాయి. ప్రముఖ హీరోలు అందరికీ జావెద్ హబీబ్ హెయిర్‌ స్టైలిష్ట్‌గా వ్యవహరించారు.

బీజేపీలో చేరిన సంధర్భంగా మాట్లాడిన జావేద్.. ఇప్పటివరకు నేను హెయిర్ (వెంట్రుకలు)కు గార్డును.. ఇకనుంచి ఈ దేశానికి సెక్యూరిటీ గార్డునని అన్నారు. కాగా గతంలో జావేద్‌ను బీజేపీ తీవ్రంగా విమర్శించింది. హిందువుల మనోభావాలను కించపరిచేలా తన సెలూన్ గురించి ప్రకటిన ఇచ్చారంటూ.. గతంలో బీజేపీ నేతలు జావెద్‌ను విమర్శించారు. దేవుళ్లు, దేవతలు కూడా తమ సెలూన్ కు కటింగ్ కు వస్తారంటూ జావేద్ ఇచ్చిన ప్రకటన అప్పట్లో తీవ్ర వివాదంకు కారణం అయింది.