Maratha Reservation: మళ్లీ మొదలైన మరాఠా రిజర్వేషన్ పోరు.. జల్నాలో తీవ్ర ఘర్షణ, 42 మంది పోలీసులకు గాయాలు
ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు బాంబే హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు రిజర్వేషన్‌ను రద్దు చేయలేదు, కానీ 17 జూన్ 2019 నాటి ఒక నిర్ణయంలో విద్యా సంస్థల్లో 12 శాతానికి, ప్రభుత్వ ఉద్యోగాల్లో 13 శాతానికి కోటాను తగ్గించింది.

Maratha Reservation Protest: మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో మరాఠా రిజర్వేషన్ల ఆందోళన శుక్రవారం (సెప్టెంబర్ 1) హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలో 42 మంది పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు రెండు బస్సులకు నిప్పుపెట్టి పలు వాహనాలను ధ్వంసం చేశారు. శాంతి భద్రతల్ని కాపాడాలని ప్రజలకు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విజ్ఞప్తి చేశారు. మనోజ్ జరాంగే నాయకత్వంలో మరాఠా వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఉద్యమంలో హింస చెలరేగింది. ఈ హింసకు కారణమైన మరాఠా రిజర్వేషన్ ఉద్యమ కథ ఏమిటో, అది ఎందుకు పెరుగుతోందో తెలుసుకుందాం.
మరాఠా రిజర్వేషన్ ఉద్యమం ఎందుకు మొదలైంది?
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం 2021లో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మొదలైంది. అయితే అది రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. వాస్తవానికి, మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ కావాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీని కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం 30 నవంబర్ 2018న రాష్ట్ర అసెంబ్లీలో మరాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది. దీని కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిబంధన పెట్టారు.
Mohan Bhagwat: మన దేశం పేరు ఇడియా కాదు, భారత్.. అలాగే పిలవాలంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్
ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు బాంబే హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు రిజర్వేషన్‌ను రద్దు చేయలేదు, కానీ 17 జూన్ 2019 నాటి ఒక నిర్ణయంలో విద్యా సంస్థల్లో 12 శాతానికి, ప్రభుత్వ ఉద్యోగాల్లో 13 శాతానికి కోటాను తగ్గించింది. అంతే కాకుండా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని అధిగమించవచ్చని హైకోర్టు పేర్కొంది. అయితే బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. మరాఠా రిజర్వేషన్ల అమలు 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని దాటిందని, ఇది ఇందిరా సాహ్ని కేసు, మండల్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు వాదించారు.
Chandrayaan-3: ఆదిత్య ఎల్-1 విజయవంతం కాగానే మరో గుడ్ న్యూస్.. చంద్రుడిపై సెంచరీ కొట్టిన చంద్రయాన్-3
5 మే 2021న, మరాఠా కమ్యూనిటీకి ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని మరాఠా రిజర్వేషన్ బిల్లును సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీన్ని అమలు చేయడం 50 శాతం పరిమితిని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో పాటు 50 శాతం పరిమితిని పునఃపరిశీలించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం మరాఠా రిజర్వేషన్ డిమాండ్ కోసం ఉద్యమం మొదలైంది. గత ఉద్ధవ్ ప్రభుత్వం, ప్రస్తుత ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం మరాఠా రిజర్వేషన్‌కు మద్దతిస్తున్నప్పటికీ, సుప్రీం కోర్టు ఆదేశం తర్వాత వారి చేతులు కట్టిపడేసినట్టు అయ్యాయి. కాగా, మహారాష్ట్రలో ఇప్పటికే 52 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.
మహారాష్ట్రలో రిజర్వేషన్ల ప్రస్తుత స్థితి
షెడ్యూల్డ్ కులాలు (SC) – 13%
షెడ్యూల్డ్ తెగలు (ST) – 7 శాతం
ఇతర వెనుకబడిన తరగతులు (OBC) – 32 శాతం
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (EWS) – 10 శాతం
మొత్తం- 62 శాతం
మరాఠాలు ఎవరు?
మహారాష్ట్రలో రైతులు, భూస్వాములు, ఇతర తరగతులతో కూడిన కులాల సమితి ఉంది.
మహారాష్ట్రలోని మరాఠా సమాజం రాష్ట్ర జనాభాలో 30 శాతానికి పైగా ఉంది.
మరాఠాలు చారిత్రాత్మకంగా యోధులుగా గుర్తింపు పొందారు.
రాష్ట్ర రాజకీయాలపై కూడా మరాఠాల ప్రభావం ఎక్కువ.
మహారాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రులలో ఎక్కువ మంది మరాఠాలే.
2018లో మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ కోసం పెద్ద ఉద్యమం జరిగింది.