Puducherry: బైకుపై నుంచి రోడ్డుపై గుంతలో పడి తాతకు గాయాలు.. మనవడు ఏం చేశాడో తెలుసా?

రోడ్డుపై ఉన్న గుంతలో పడి తన తాతకు గాయాలైతే.. ఇంకెవరికీ అలా గాయాలు కాకూడదని ఆ గుంతను పూడ్చేశాడో మనవడు. అలాగని ఆ మనవడి వయసు ఎక్కువేమీ కాదు. పదమూడేళ్లే. చదువుతోంది ఎనిమిదో తరగతే.

Puducherry: బైకుపై నుంచి రోడ్డుపై గుంతలో పడి తాతకు గాయాలు.. మనవడు ఏం చేశాడో తెలుసా?

Updated On : January 23, 2023 / 11:06 AM IST

Puducherry: రోడ్లపై గుంతలుండి వాటివల్ల ప్రమాదాలు జరిగితే, ఆ ప్రమాదంలో గాయపడ్డ వాళ్ల గురించి మాత్రమే ఆలోచిస్తారు ఎవరైనా. ఆ గుంతల్ని పెద్దగా పట్టించుకోరు. అధికారులు మాత్రమే స్పందించి ఏవో తాత్కాలిక మరమ్మతులు చేస్తుంటారు. కానీ, ఒక బాలుడు మాత్రం అలా వదిలేయలేదు.

California Shooting: క్యాలిఫోర్నియా కాల్పుల నిందితుడు ఆత్మహత్య.. పోలీసులు చుట్టుముట్టడంతో గన్‌తో కాల్చుకుని మృతి

రోడ్డుపై ఉన్న గుంతలో పడి తన తాతకు గాయాలైతే.. ఇంకెవరికీ అలా గాయాలు కాకూడదని ఆ గుంతను పూడ్చేశాడో మనవడు. అలాగని ఆ మనవడి వయసు ఎక్కువేమీ కాదు. పదమూడేళ్లే. చదువుతోంది ఎనిమిదో తరగతే. తమిళనాడు పుదుచ్చేరికి చెందిన ఒక వృద్ధుడు ఇటీవల బైకుపై వెళ్తూ, రోడ్డుపై ఉన్న గుంతల్లో పడి గాయపడ్డాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన మనవడు, మాసిలామణి పెద్ద మనసుతో ఆలోచించాడు. తన తాతలాగా ఇంకెవరూ గాయపడకూడదని రోడ్లపై ఉన్న గుంతల్ని పూడ్చాలనుకున్నాడు. తనే సొంతంగా ఇసుక, మట్టి, సిమెంట్, ఇతర పదార్థాలు సేకరించి ఆ రోడ్లపై ఉన్న గుంతల్ని పూడ్చాడు.

Karimnagar: కరీంనగర్‌లో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి 11 రోజులపాటు వేడుకలు

తనే సొంతంగా ఈ పనికి పూనుకున్నాడు. ఈ విషయం తెలిసి స్థానికులు, ప్రజా ప్రతినిధులు మాసిలామణిని అభినందించారు. శాలువాతో సత్కరించారు. స్థానిక ఎమ్మెల్యే వైయాపురి మణికందన్ కూడా బాలుడి ఇంటికి వెళ్లి స్వయంగా అభినందించాడు. బాలుడు చేసిన పనికి సోషల్ మీడియాలోనూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రోడ్లను ప్రభుత్వం బాగు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.