ఉగ్ర రచ్చ : అసెంబ్లీలో సిద్ధూ ఫొటోలు కాల్చివేత

  • Published By: veegamteam ,Published On : February 18, 2019 / 09:44 AM IST
ఉగ్ర రచ్చ : అసెంబ్లీలో సిద్ధూ ఫొటోలు కాల్చివేత

Updated On : February 18, 2019 / 9:44 AM IST

చంఢీఘ‌డ్ : పుల్వామా ఉగ్ర ఘ‌ట‌న పంజాబ్ అసెంబ్లీలో చిచ్చు రేపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని నిరసనగా పంజాబ్ మంత్రి..మాజీ క్రికెటర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూకు వ్య‌తిరేకంగా.. విప‌క్ష పార్టీలు ఫైర‌య్యాయి. ఈ క్రమంలో సిద్ధూ ఫోటోలను అసెంబ్లీలో కాల్చివేశారు. అకాలీద‌ళ్ నేత బిక్ర‌మ్ సింగ్ మ‌జితా అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోనే  సిద్ధూ ఫోటోల‌ను ద‌హ‌నం చేశారు. 
 

పాకిస్థాన్ ఎన్నికల్లో విజయం సాధించి పాక్  ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. అప్పుడు పాకిస్థాన్ ఆర్మీ జ‌న‌ర‌ల్‌తోనూ సిద్ధూ ఫొటోలు దిగారు. ఆ ఫొటోల‌ను అసెంబ్లీకి తీసుకువ‌చ్చిన అకాలీనేత బిక్ర‌మ్ సింగ్ మ‌జితా.. వాటిని అసెంబ్లీ క్యాంపస్ లోనే కాల్చేశారు. అనంతరం బ‌డ్జెట్ స‌మావేశాల్లోనూ సిద్ధూను మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ మజితా నినాదాలు చేశారు.

పాక్ చ‌ర్య‌ను ఖండిస్తారా లేదా అంటు సిద్ధూని  ప్రశ్నించారు. దీంతో మ‌జితాకు సిద్ధూ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేయగా..ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అకాలీద‌ళ్‌, బీజేపీ స‌భ్యులు.. న‌ల్ల‌బ్యాడ్జీలు ధ‌రించి స‌భ‌లో సిద్ధూ వివ‌ర‌ణ ఇవ్వ‌కుండా అడ్డుప‌డుతూ సిద్ధూ రాజీనామా చేయాల్సిందనంటూ నినాదాలు చేస్తూ అడ్డుపడ్డారు.
 

Read Also : ఆదుకున్న అక్షయ్ : అమర జవాన్లకు రూ. 5 కోట్లు విరాళం

Read Also : Pulwama effect: పాక్ క్రికెట్ మ్యాచ్‌లు మేం ప్రసారం చేయం