ఎందుకలా? : పంజాబ్ వెళ్లాల్సిన పార్సిల్.. చైనా వెళ్లింది

ఎందుకలా? : పంజాబ్ వెళ్లాల్సిన పార్సిల్.. చైనా వెళ్లింది

Updated On : February 13, 2019 / 10:18 AM IST

ప్రేమగా పంపే కానుకలు, అత్యవసరంగా చేరాల్సిన వస్తువులు ఓ సారి లేట్ అయితేనే ఎక్కడలేని అసహనం, చిరాకు పుట్టుకొస్తాయి. అలాంటిది రోజూ వాడాల్సిన మందులు దేశం దాటి వేరే దేశానికి చేరిపోతే ఏం చేసేది. రూ.5 వేల మందులను చంఢీఘడ్‌లో నివాసముంటున్న బల్విందర్ కౌర్..  పంజాబ్‌లో ఉంటున్న తన తల్లికి పంపాలనుకుంది. ఈ మేర రాజ్‌భవన్ పోస్టు ఆఫీసు నుంచి అడ్రస్ రాసి పార్సిల్ చేసింది. 2018 జనవరి 19న పంపిన ఆ మందుల డబ్బా జనవరి 27నాటికి చైనా చేరుకుంది. 

 

చైనాలో ఆ అడ్రస్ ఎక్కడో తెలియని అధికారులు దానిని ఓ మూలన పడేసి ఉంచారు. పార్సిల్ రాలేదని కౌర్ తిరిగి పోస్టాఫీసులో కొరియర్ కోసం కంప్లైట్ చేస్తే అప్పుడు తేరుకున్నారు కొరియర్ సిబ్బంది. తిరిగి జనవరి 31 నాటికల్లా కౌర్ చేతికి అప్పగించారు. తాను పంపిన అడ్రస్‌కు వెళ్లకుండా తప్పుడు అడ్రస్‌కు డెలీవరి చేయడం సమయం వృథాతో పాటు, ఆ మందుల కోసం మానసికంగా ఆందోళన చెందినందుకు గానూ రూ.5వేలు ఇవ్వాలంటూ ఆ కస్టమర్ కొరియర్ అధికారులను అడిగిందట. 

 

ఈ భయంతోనే పార్సిల్‌ను తిరిగి చేర్చేందుకు కౌర్‌ను కరెక్ట్ అడ్రస్ రాయమని కోరారట. CHAINAకి బదులు CHINA అని రాయడంతో అసలు సమస్య జరిగిందని ఆ తర్వాత నిర్దారణకు వచ్చారు అధికారులు. ఇండియన్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్, సెక్షన్ 6కింద తప్పుడు అడ్రస్‌కు డెలీవరి చేసినా, కొరియర్ పోగొట్టినా చట్టపరంగా శిక్షార్హులు.