Answer Sheetలో వంద రూపాయలు పెట్టండి.. జై హింద్, జై భారత్: ప్రిన్సిపాల్ సలహా

Answer Sheetలో వంద రూపాయలు పెట్టండి.. జై హింద్,  జై భారత్: ప్రిన్సిపాల్ సలహా

Updated On : February 20, 2020 / 8:45 AM IST

బోర్డ్ ఎగ్జామ్స్ రాయబోయే పదో తరగతి పిల్లల్లో స్ఫూర్తి నింపాలనుకున్న స్కూల్ ప్రిన్సిపాల్ మాటలు అరెస్టు అయ్యేలా చేశాయి. బోర్డ్ ఎగ్జామ్స్‌లో టీచర్స్‌ను ఎలా మోసం చేయొచ్చో.. చెప్తూ విద్యార్థులకు తప్పుడు ప్రచారం చేసి బుక్కయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ మేనేజర్ కమ్ ప్రిన్సిపల్ పరీక్షల ప్రిపరేషన్ గురించి స్పీచ్ ఇచ్చాడు. 

పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అవకుండా ఉండాలంటే ఇలా చేయాలి. ‘నా స్టూడెంట్స్ ఎవ్వరూ ఫెయిల్ అవ్వరనీ చాలెంజ్ చేస్తున్నా. దేనిక భయపడాల్సిన అవసరం లేదు. మీలో మీరు ఎలా అయినా మాట్లాడుకోవచ్చు. కానీ, ఒకరినొకరు టచ్ చేయకూడదు. అంతవరకూ ఓకే’

‘భయపడొద్దు. మీరు పరీక్ష రాసే సెంటర్లు అయిన ప్రభుత్వ పాఠశాలల్లో వాలంటీర్లు అంతా నా ఫ్రెండ్సే. మీరు కాపీ కొడుతూ దొరికిపోతే టీచర్ చెంపదెబ్బ కొట్టినా పట్టించుకోవద్దు. ఏ ప్రశ్నను సమాధానం రాదని వదిలేయకండి. ఆన్సర్ షీట్‌లో ఓ 100రూపాయలు పెట్టండి. టీచర్లు గుడ్డిగా మీకు మార్కులేసేస్తారు. 

సమాధానం తప్పుగా రాసినా సరే. నాలుగు మార్కుల ప్రశ్నకు మూడు మార్కులు కచ్చితంగా ఇస్తారు. అని చెబుతూ.. చివర్లో జై హింద్.. జై భారత్ తో ముగించారు.  తాను చెప్పుకుంటూ పోయాడు కానీ, ఇదెంత మందికి నచ్చింది కరెక్ట్ చెబుతున్నానా లేదా అని చూసుకోలేదు. మొత్తం వీడియోను రికార్డు చేసిన ఓ స్టూడెంట్ నేరుగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గ్రీవెన్స్ పోర్టల్‌కు కంప్లైంట్ చేశాడు. 

రెండు నిమిషాల నిడివి ఉన్న వీడియో..  ఆధారంగా విచారణ జరిపిన అధికారులు ప్రిన్సిపాల్ ను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది సెకండరీ బోర్డ్ ఎగ్జామ్స్ కోసం 938 సెన్సిటివ్ సెంటర్లు ఏర్పాటు చేసింది.