క్వారంటైన్‌లో ఉండండి.. అది ఇస్లాంకు వ్యతిరేకం కాదు: తబ్లిగీ మౌలానా

తబ్లిఘీ జమాత్ అధ్యక్షుడు మౌలానా సాద్ కంధల్వీ క్వారంటైన్ లో ఉండాలంటూ సూచిస్తున్నారు. మార్చి నెలలో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జమాత్ నిర్వహించడంతో కొద్ది రోజులుగా అతనిపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేశారు. మంగళవారం ఢిల్లీ పోలీసులు అతనికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహమ్మారి చట్టం ప్రకారం.. నియమాలను ఉల్లంఘించినందుకు కేసు ఫైల్ అయింది.
నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ తో పాటు మిగిలిన అధికారులంతా కలిసి మసీదులోని ఆరు అంతస్థుల్లో ఉన్న ముస్లింలను చెదరగొట్టాలని రిక్వెస్ట్ చేశాం. అయినా మా మాట వినలేదు. దాని కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి’ మార్చి 28 నుంచి ఆయన అదుపులోనే ఉన్నాడు. బుధవారం ఓ ఆడియో క్లిప్ విడుదల చేసిన మౌలానా సాద్.. ప్రభుత్వానికి సహకరించాలంటూ కామెంట్ చేశారు. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని, భారీగా గుంపులు కావడం తగ్గించాలని పిలుపునిచ్చారు.
‘మేం కూడా గుమిగూడటం మానేశాం. ప్రభుత్వం చెప్పినట్లు చేద్దాం. వారికి సహకరించడం, సహాయం చేయడం మనవిధి’ అని తబ్లీఘీ జమాత్ సభ్యులకు సూచించారు. ‘మీరు ఎక్కడైనా క్వారంటైన్ లో ఉండండి. అది ఇస్లాంకు వ్యతిరేకం కాదు. షరియత్ కు విరుద్దంకానే కాదు’ అని అన్నారు. డాక్టర్ల సలహా మేరకు ఆయన కూడా క్వారంటైన్ లోనే ఉన్నట్లు మెసేజ్ లో చెప్పారు. మనుషులు చేసిన పాపాల కారణంగానే మహమ్మారి ఇలా వచ్చిందని పేర్కొన్నారు.
ఈ జమాత్ కు వెళ్లి వచ్చిన వారి వివరాలు పూర్తిగా తెలియకపోవడం ఓ సమస్య. వివరాలు తెలిసిన 2వేల 361మందిలో 617మంది హాస్పిటల్లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. మిగిలిన వారు క్వారంటైన్ లో ఉన్నారు. నిజాముద్దీన్ లో ఉన్న మర్కజ్ బిల్డింగ్ మొత్తాన్ని శానిటైజ్ చేశారు.
Also Read | కరోనాతో మరణించిన గ్రామీ అవార్డు గ్రహీత