R Krishnaiah : బీసీ ప్రధాని అయి ఉండి బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టకపోవడం దారుణం : ఆర్ కృష్ణయ్య

దేశంలో తాము 56 శాతం ఉన్నాం.. ఎందుకు తమపై వివక్ష చూపుతున్నారు? తమకు ఏమైనా భిక్షం వేస్తున్నారా అని ప్రశ్నించారు. బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని, బీసీలకు ఏ పథకాలు పెట్టారని నిలదీశారు.

R Krishnaiah : బీసీ ప్రధాని అయి ఉండి బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టకపోవడం దారుణం : ఆర్ కృష్ణయ్య

R Krishnaiah

R Krishnaiah – PM Modi : మహిళ రిజర్వేషన్ బిల్లు సభలో ఆమోదం పొందడంపై తాము సంతోషిస్తున్నామని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని తాము డిమాడ్ చేస్తున్నామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం వందల సార్లు ధర్నాలు చేశామని చెప్పారు. ప్రధాని మోదీ బీసీలకు మొండి చెయ్యి చూపారని తెలిపారు. బీసీ ప్రధాని అయి ఉండి బీసీ రిజర్వేషన్ బిల్లును సభలో పెట్టకపోవడం దారుణం అన్నారు.

గురువారం ప్రధాని మోదీని కలిశానని బీసీలకు న్యాయం చేస్తామని ప్రధాని అన్నారని పేర్కొన్నారు. బీసీలు అంటే భిక్ష గాళ్ళు కారన్నారు. దేశంలో తాము 56 శాతం ఉన్నాం.. ఎందుకు తమపై వివక్ష చూపుతున్నారు? తమకు ఏమైనా భిక్షం వేస్తున్నారా అని ప్రశ్నించారు. బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదని, బీసీలకు ఏ పథకాలు పెట్టారని నిలదీశారు.

R Krishnaiah: ఆర్. కృష్ణయ్యతో మాణిక్‌రావ్ ఠాక్రే భేటీపై కాంగ్రెస్ నేతల రుసరుస.. కారణం అదేనా?

పశువులకు ప్రత్యేక శాఖ ఉంది కానీ బీసీలకు మంత్రిత్వశాఖ లేదని వాపోయారు. బీసీలు ఏమైనా పశువుల కంటే అధ్వాన్నమా? తాము ఎందుకు ఉరుకుంటామని పేర్కొన్నారు. మహిళ రిజర్వేషన్లు పెట్టారు కానీ అవి ఎవరికి ఉపయోగమని ప్రశ్నించారు. మీరు పెట్టిన మహిళ రిజర్వేషన్లతో పేద మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అందరూ ఏకమై బీసీ బిల్లు కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

అన్ని శాఖల్లో బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా కూడా బీసీలకు న్యాయం జరగకపోతే ఎలా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ఒక్క మంత్రిత్వశాఖ లేదు, పథకాలు, నిధులు లేవన్నారు. బీసీలు గొంగడి కప్పుకొని పడుకుంటే ఇవన్నీ రావన్నారు. పోరాటం చేయాలని, అప్పుడే మన హక్కులు సాధిస్తామని తెలిపారు.