గాలి గ్యాంగ్ కి రాహుల్ అధ్యక్షుడు : ఈసీని కలిసిన కేంద్రమంత్రులు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కోడ్ ఉపయోగించారని ఆరోపిస్తూ కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.

  • Published By: venkaiahnaidu ,Published On : April 12, 2019 / 11:35 AM IST
గాలి గ్యాంగ్ కి రాహుల్ అధ్యక్షుడు : ఈసీని కలిసిన కేంద్రమంత్రులు

Updated On : April 12, 2019 / 11:35 AM IST

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కోడ్ ఉపయోగించారని ఆరోపిస్తూ కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కోడ్ ఉపయోగించారని ఆరోపిస్తూ కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు శుక్రవారం (ఏప్రిల్-12,2019) ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి కంప్లెయింట్ చేశారు.సుప్రీంకోర్టు తీర్పును మార్చి ప్రధానిని దొంగ అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలను ఎన్నికల నియామవళి ఉల్లంఘన కింద పరిగణించాలని కంప్లెయింట్ లో తెలిపారు. 
Read Also : తమిళనాడు పాలన తమిళనాడు నుంచే : స్టాలిన్ సీఎం అవుతారు

ఈసీతో సమావేశం అనంతరం కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాట్లాడుతూ…ప్రధాని మోడీపై అభ్యంతరకరమైన పదజాలం వాడుతూ రాహుల్ గాంధీ అన్ని హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడన్నారు.రాహుల్ ని కాంగ్రెస్ గాలి గాంగ్ చీఫ్ గా ఆయన అభివర్ణించారు.ఏ ఆధారాలు లేకుండా రాహుల్ చేస్తున్న వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు.అసత్యాన్ని ప్రచారం చేసి గెలవాలని కాంగ్రెస్ చూస్తొందన్నారు.