రాహుల్ పై ఆన్ లైన్ ట్రోలింగ్ : బడ్జెట్ సమయంలో..మ్యాథ్స్ క్లాసులో బోర్ కొట్టిన విద్యార్థిలా

రాహుల్ పై ఆన్ లైన్ ట్రోలింగ్ : బడ్జెట్ సమయంలో..మ్యాథ్స్ క్లాసులో బోర్ కొట్టిన విద్యార్థిలా

Updated On : February 1, 2021 / 6:34 PM IST

Rahul Gandhi ఇవాళ(ఫిబ్రవరి-1,2021)పార్లమెంట్ లో.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో రాహుల్ గాంధీ విసుగుచెందినట్టుగా హావభావాలు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో నెటిజన్లు మీమ్స్ రూపొందించారు. బడ్జెట్ నేపథ్యంలో ఈ మీమ్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బయాలజీ క్లాసులో హుషారుగా ఉండే రాహుల్ గాంధీ, మ్యాథ్స్ క్లాసులో ఎలా బోర్ ఫీలవుతున్నాడో చూడండి అంటూ ఈ మీమ్స్ సందడి చేస్తున్నాయి. మధ్యాహ్నా భోజనం తర్వాత క్లాస్ లో కూర్చొన్న కాలేజీ విద్యార్థిగా రాహుల్ కనిపిస్తున్నాడని ఓ నెటిజన్ ఫన్నీగా ట్వీట్ చేయగా..అరే తొందరగా చెప్పు..జర్మనీ వెళ్లిపోవాలి అంటూ వ్యంగ్యంగా మరో నెటిజన్ ట్వీట్ చేశారు. పొద్దును ఆన్ లైన్ క్లాసులకు హాజరైన విద్యార్థిలా రాహుల్ ఉన్నాడని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

మరోవైపు, కేంద్ర బడ్జెట్‌ పై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తామన్న హామీని మర్చిపోయారని మోడీ సర్కారుపై విమర్శలు చేశారు. బడ్జెట్​తో పేదలకు అండగా నిలవాల్సిన మోడీ సర్కార్​.. ప్రభుత్వ ఆస్తులను తన పెట్టుబడిదారి మిత్రులకు కట్టబెట్టేలా కేటాయింపులు చేసినట్లు కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, కార్మికులు, ఎంఎస్​ఎంఈలకు ఊతమందించాలని డిమాండ్​ చేశారు. రక్షణ రంగానికి చేసిన కేటాయింపులపై రాహుల్​ అసంతృప్తి వ్యక్తం చేశారు.