Manipur Violence: రోడ్డుపై వెళ్తున్న కాన్వాయ్‭ను అడ్డుకున్న పోలీసులు.. వెనక్కి వెళ్లి చాపర్‭లో వచ్చిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్‭పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడతారు. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మాట్లాడతారు

Manipur Violence: రోడ్డుపై వెళ్తున్న కాన్వాయ్‭ను అడ్డుకున్న పోలీసులు.. వెనక్కి వెళ్లి చాపర్‭లో వచ్చిన రాహుల్ గాంధీ

Updated On : June 29, 2023 / 5:49 PM IST

Rahul Gandhi: దాదాపుగా రెండు నెలలుగా నిప్పుల కుంపటిలో రగులుతున్న మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని ఆ రాష్ట్ర రాజధాని ఇంఫాల్‭కు సమీపంలో కాన్వాయ్‭ని పోలీసులు అడ్డుకున్నారు. వాస్తవానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం మణిపూర్ చేరుకున్న రాహుల్.. అల్లర్లకు కారణమైన చురాచాంద్‭పూర్ జిల్లాకు బయల్దేరారు. ఈ సందర్భంలోనే ఆయన కాన్వాయ్‭ని అడ్డుకుని మధ్యలోనే నిలిపివేశారు.

Jithender Reddy : దున్నపోతు ట్రీట్‌మెంట్ అంటూ ట్వీట్ చేసిన మాజీ ఎంపీ .. బీజేపీలో పెను దుమారం

అయితే పోలీసులు ఆపేయడంతో ఇంఫాల్‭కు తిరిగిన వెళ్లిన రాహుల్.. అక్కడ నుంచి చాపర్ తీసుకుని చురాచాంద్‭పూర్ చేరుకున్నారు. రాహుల్ గాంధీ ప్రయాణించే మార్గంలో పెద్దఎత్తున మహిళా నిరసనకారులు ఉండడంతో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిరసనల్ని పోలీసులు ప్రస్తావిస్తూ “ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతాయనే మేము ఆందోళన చెందాము. అందుకే ముందుజాగ్రత్తగా, బిష్ణుపూర్‌లో కాన్వాయ్‌ని ఆపివేయమని అభ్యర్థించాము” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

CM KCR: కంటతడి పెట్టిన కేసీఆర్.. సాయిచంద్ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం

కాగా, దీనిపై కాంగ్రెస్ పార్టీ మరో విధంగా స్పందించింది. రాహుల్ గాంధీని అడ్డుకున్నందుకు పోలీసులకు వ్యతిరేకంగా మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నారని, చురచంద్‌పూర్‌తో పాటు తమ గ్రామాన్ని కూడా సందర్శించాలని వారు కోరుతున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునేందుకే ఆయన మణిపూర్‌లో పర్యటించారని.. రాజకీయాలు చేసేందుకు ఇక్కడికి రాలేదని.. ఆయన రోడ్డును ఎందుకు అడ్డుకుంటున్నారని ఆందోళన చేస్తున్న మహిళ ఒకరు ప్రశ్నించారు.

Opposition Meet: విపక్షాల రెండవ సమావేశం బెంగళూరులోనట.. స్పష్టం చేసిన శరద్ పవార్

కాంగ్రెస్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. చురాచాంద్‭పూర్ జిల్లాలో తలదాచుకున్న ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడతారు. అనంతరం శుక్రవారం రాజధాని ఇంఫాల్ నగరంలోని శిబిరాల్లో ఉన్న ప్రజలను పరామర్శిస్తారు. అలాగే మణిపూర్ పౌర సమాజ నేతలతో కూడా మాట్లాడతారు. రాష్ట్రంలో చెలరేగిన జాతి కలహాలు తీవ్ర అల్లర్లుగా మారడం కారణంగా దాదాపు 50,000 మంది ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా 300 పైగా సహాయక శిబిరాల్లో ఉంటున్నారు.

France: ఫ్రాన్స్‌లో భారీగా చెలరేగుతున్న ఆందోళనలు.. కనపడిన వాటిని తగులబెడుతున్న నిరసనకారులు.. ఎందుకంటే?
రాష్ట్రంలోని మైతీ-కుకీ జాతుల మధ్య ఏర్పడ్డ వైరం తీవ్ర పరిస్థితులకు దారి తీసింది. మే 3వ తేదీన ఈ వర్గాల మధ్య మొదటిసారి ఘర్షణలు ప్రారంభమయ్యాయి. తమను షెడ్యూల్డ్ కులాల్లో కలపాలంటూ మైతీ వర్గం నిర్వహించిన ‘ట్రైబల్ సాలిడేటరీ మార్చ్’పై దాడితో ఈ ఘర్షణ మొదలైంది. మణిపూర్ జనాభాలో మైతీలు 53 శాతం వరకు ఉంటారు. వారంతా ఇంఫాల్ లోయలో ఉంటారు. ఇక నాగాలు, కుకీలు 40 శాతం ఉంటారు. వీరు ఇతర జిల్లాల్లో ఉంటారు.