Video: రాహుల్ యాత్రలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు.. కారు ఆపి, వాళ్ల వద్దకు వెళ్లి రాహుల్ ఏం చేశారో తెలుసా?

మోదీ.. మోదీ.. అని నినదిస్తూ రాహుల్ గాంధీకి అసహనం తెప్పించే ప్రయత్నం చేశారు. అయితే, రాహుల్ గాంధీ..

Video: రాహుల్ యాత్రలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు.. కారు ఆపి, వాళ్ల వద్దకు వెళ్లి రాహుల్ ఏం చేశారో తెలుసా?

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి తిరిగి ప్రారంభమైంది. ఆయనను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రాహుల్ గాంధీకి యాత్రలో పాల్గొంటున్న వేళ కొందరు కాషాయ జెండాలు పట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మోదీ.. మోదీ.. అని నినదిస్తూ రాహుల్ గాంధీకి అసహనం తెప్పించే ప్రయత్నం చేశారు. అయితే, రాహుల్ గాంధీ ఏ మాత్రం అసహనానికి గురికాలేదు. వెంటనే కారు ఆపి దిగి వారి వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. అనంతరం మళ్లీ కారు ఎక్కి, ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చుకుంటూ వెళ్లారు.

రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో మోదీ.. మోదీ నినాదాలు చేస్తున్నారు. తాను బీజేపీ సృష్టిస్తున్న విద్వేషపూరిత సమాజంలో ప్రేమను పంచుతానని రాహుల్ గాంధీ చాలా కాలంగా చెబుతున్నారు.

కాగా, జనవరి 14న మణిపూర్‌లోని తౌబాల్‌లో ప్రారంభమైన రాహుల్ గాంధీ యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. మొత్తం 6,700 కిలోమీటర్ల మేర యాత్ర 110 జిల్లాల మీదుగా ఉంటుంది. ఈ యాత్రను రాహుల్ గాంధీ బస్సు, కార్లలో చేస్తున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ యాత్ర ముందుకు సాగుతోంది.