Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన యూపీ కోర్టు

కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి యూపీలోని కోర్టు షాకిచ్చింది. ఆయనకు ఆదివారం నోటీసులు జారీ చేసింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన యూపీ కోర్టు

Rahul Gandhi

Updated On : December 22, 2024 / 2:45 PM IST

UP Court Summons Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి యూపీలోని కోర్టు షాకిచ్చింది. ఆయనకు ఆదివారం నోటీసులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని నోటీసుల్లో రాహుల్ గాంధీని కోర్టు ఆదేశించింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కులగణనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయంటూ పంకజ్ పాఠక్ అనే వ్యక్తి యూపీలోని బరేలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

Also Read: Sunita Williams: సునీతా విలియమ్స్ అంతరిక్షంలో ఇంకా ఎంతకాలం సురక్షితంగా ఉండగలరు? సైన్స్ ఏం చెబుతోంది..

తొలుత ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు తోసిపుచ్చింది. తాజాగా జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో అతడి పిటిషన్ ను విచారణకు కోర్టు స్వీకరించింది. ఈ క్రమంలో జనవరి 7న కేసు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ రాహుల్ కు నోటీసులు జారీ చేసింది.