Rahul Gandhi Petition : పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్

దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ బద్ధం, చట్ట బద్దం, సరైనదేనని తేల్చి చెప్పింది. ఇందులో జోక్యం చేసుకునేందుకు సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని హైకోర్టు సింగిల్ జడ్జీ హేమంత్ అన్నారు.

Rahul Gandhi Petition : పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్

Rahul Gandhi

Updated On : July 16, 2023 / 8:32 AM IST

Defamation Case : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం చేపట్టనుంది. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది.

దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ బద్ధం, చట్ట బద్దం, సరైనదేనని తేల్చి చెప్పింది. ఇందులో జోక్యం చేసుకునేందుకు సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని హైకోర్టు సింగిల్ జడ్జీ హేమంత్ అన్నారు. మరోవైపు రాహుల్ వ్యాఖ్యలు మోదీ ఇంటి పేరు ఉన్నవారి పరువు ప్రశ్నార్థకం చేస్తాయని జస్టిస్ హేమంత్ అభిప్రాయపడ్డారు.

Rahul Gandhi: ఇక్కడ మణిపూర్ మండిపోతోంది.. మీరేమో ఫ్రాన్సులో..: రాహుల్ గాంధీ

రాహుల్ చేసిన వ్యాఖ్యలకుగానూ ఆయనపై దేశవ్యాప్తంగా పలు చోట్ల పది క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. వీర్ సావర్కర్ మనమడు కూడా ఆయనపై కేసు వేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు కూడా రాహుల్ శిక్షపై స్టే విధించేందుకు నిరాకరిస్తే ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాహుల్ కు ఉండదని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.