దసరా పండుగకు 392 ప్రత్యేక రైళ్లు

Railways:FESTIVAL రద్దీని తగ్గించే క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మంగళవారం 392ప్రత్యేక రైళ్లకు ఆమోదం తెలిపింది. పండుగ స్పెషల్ సర్వీసెస్ పేరుతో 2020 అక్టోబరు 20 నుంచి 2020 నవంబరు 30వరకూ వీటిని నడపనున్నారు. పండుగ స్పెషల్ సర్వీసెస్ టిక్కెట్ ధర స్పెషల్ సర్వీసెస్ ధరతో సమానం ఉంటుంది.
జోనల్ రైల్వేస్ వాటి షెడ్యూల్ ను ముందుగానే అందించలేవు. ఈ స్పెషల్ ట్రైన్లు కోల్‌కతా, పట్నా, వారణాసి, లక్నో లాంటి ప్రాంతాలకు నడపనున్నారు. మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న పండుగ సీజన్ దుర్గా పూజ, దసరా, దీపావళి, ఛాట్ పూజలకు ప్రయాణికుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
రైల్వే బోర్డ్ ఓ ఆర్డర్లో స్పెషల్ రైళ్లు అనేవి 55కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి. స్పెషల్ ట్రైన్ ధరలే వీటికి వర్తిస్తాయి. నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ 300 మెయిల్, మరికొన్ని ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు ఉండనున్నట్లు చెప్పింది.
రైల్వేస్ అన్ని ప్యాసింజర్ ట్రైన్ సర్వీసులను మార్చి 25నుంచి లాక్‌డౌన్ కారణంగా రద్దు చేశాయి. శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ పేరిట సర్వీసులను పునరుద్ధరించారు. వలస కార్మికులను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు మే 1 కార్మికుల దినోత్సవం సందర్భంగా మళ్లీ పట్టాలెక్కాయి.
ఆ 80రైళ్ల తర్వాత సెప్టెంబర్ 12నుంచి 230 ప్రత్యేక రైళ్లు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. COVID-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అదనపు రైల్ సర్వీసులను స్టార్ట్ చేయనున్నారు. రీసెంట్ గా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్లోనింగ్ సర్వీసులను ప్రారంభించింది ఇండియన్ రైల్వే.