Raj Thackeray : ఎన్సీపీలో చీలిక వెనుక శరద్ పవార్ హస్తం.. రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
అజిత్ పవార్ తోపాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారని, ఇది చాలా అసహ్యంగా ఉందని రాజ్ ఠాక్రే వెల్లడించారు.

Raj Thackeray
Sharad Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ పై మహారాష్ట్ర నవ (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీలో చీలిక వెనుక శరద్ పవార్ హస్తం ఉందని ఆరోపించారు. ఎన్సీపీ నేత అజిత్ శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరడం వెనక శరద్ పవార్ హస్తం ఉందని రాజ్ ఠాక్రే పేర్కొన్నారు.
మూడు రోజల క్రితం ఎన్సీపీలో చీలికపై రాజ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. అజిత్ పవార్ తోపాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరారని, ఇది చాలా అసహ్యంగా ఉందని రాజ్ ఠాక్రే వెల్లడించారు. ఇది రాష్ట్ర ఓటర్లను అవమానించడమేనని పేర్కొన్నారు.
Ajit Pawar faction : మా వర్గానికి 40 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉంది…అజిత్ పవార్ వర్గం ప్రకటన
అజిత్ పవార్ తో పాటు ప్రఫుల్ పటేల్, దిలీప్ వాల్సే, పాటిల్, చగన్ భుజ్ భల్ వంటి సీనియర్ నేతలు శరద్ పవార్ ఆశీస్సులు లేకుండా ముందుకెళ్లరని అన్నారు. మహరాష్ట్రలో ఇటువంటి పద్ధతులకు శ్రీకారం చుట్టిందే శరద్ పవార్ అని విమర్శించారు. 1978లో నాటి వసంత దాదా పాటిల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 40మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పవార్ చీల్చారని తెలిపారు.
పురోగామి లోహసాహి దల్ (పులోద్) ప్రభుత్వానికి తొలిసారి శరద్ పవార్ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. అంతకుముందు ఇటువంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. పవార్ తో మొదలైన ఈ కార్యక్రమాలు పవార్ తోనే ముగిశాయని రాజ్ ఠాక్రే వెల్లడించారు.