Rajasthan: రాజస్థాన్‌లో సీజేపీ బృందానికి షాక్.. స్కూళ్ల పరిశీలనకు వెళ్తే గ్రామస్తుల ఆగ్రహం.. రాళ్లతో దాడి
రాజస్థాన్(Rajasthan)లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పరిశీలనకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) బృందానికి చేదు అనుభవం ఎదురైంది.
Cjp team attacked by locals during school theek karo visit in jaipur
- రాజస్థాన్‌లో సీజేపీపై దాడి
- రాళ్లతో కార్యకర్తలను కొట్టిన స్థానికులు
- ఈవెంట్‌పై విమర్శలు చేసిన నాయకులు
Rajasthan: రాజస్థాన్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పరిశీలనకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)(Rajasthan) బృందానికి చేదు అనుభవం ఎదురైంది. ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రంకా నేతృత్వంలో కార్యకర్తలు జైపుర్ జిల్లాలోని రాంపురా కన్వర్పురా గ్రామానికి వెళ్లేందుకు యత్నించగా, ఊరి శివారులోనే స్థానికులు వారిని అడ్డుకున్నారు. తమ స్కూళ్లను తామే బాగు చేసుకుంటామని చెబుతూ వారిని బలవంతంగా వెనక్కి పంపించేశారు. ఈ క్రమంలో స్థానికులు తమపై రాళ్లతో దాడి చేసి, వాహనాలను ధ్వంసం చేశారని అశుతోష్ ఆరోపించారు.
ACB Raids: తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.6.87 కోట్ల ఆస్తులు స్వాధీనం.. ఇది ఎన్నోసారి తెలుసా?
బీజేపీ ప్రభుత్వంపై అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు:
ఈ దాడి ఘటనపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాడులకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ, రాజస్థాన్‌లోని బీజేపీ ప్రభుత్వమే ఈ దాడికి కారణమని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై రాళ్లు విసిరి గాయపరిచారని, ఘటన జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడికి రాకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో గూండాల పాలన నడుస్తోందని ఆయన ఆరోపించారు.
నెట్టింట వైరల్‌గా మారిన వీడియోలు:
పాఠశాలల సౌకర్యాల పరిశీలన కోసం వెళ్లిన ఒక బృందంపై ఈ స్థాయిలో విరుచుకుపడటం, వాహనాలను ధ్వంసం చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ స్థానిక యంత్రాంగం సరిగ్గా స్పందించలేదని సీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, ఈ ఘటనపై రాజస్థాన్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
