Rajastn Honeymoon Case : రాజస్థాన్ హానీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. 7ఏళ్ల తర్వాత కలుసుకున్నారు.. భర్తను చంపేశారు..
Rajastn Honeymoon Case : రాజస్థాన్ హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Rajastn Honeymoon Case
Rajastn Honeymoon Case : రాజస్థాన్ హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంజూ తన ప్రియుడు సంజూల మధ్య ఏడేళ్ల క్రితమే ప్రేమ మొదలైనట్లు, వీరిద్దరికి ఓ వివాహంలో పరిచయం ఏర్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Also Read : Delhi : ఫ్లైఓవర్‌పై ఆగిఉన్న కారు.. అందులో మూడు మృతదేహాలు.. పోలీసుల ఎంట్రీతో.. అసలేం జరిగిందంటే?
పెళ్లైన మూడు నెలలకే అంటే ఈ ఏడాది జనవరి 30న అంజలి అనే మహిళ తన భర్త ఆశీష్‌ను ప్రియుడితో కలిసి హత్య చేయించిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, పోలీసులు విచారణలో ఆశీష్ హత్యకు భార్య అంజలి, ఆమె ప్రియుడు సంజూలతోపాటు అతని స్నేహితుల ప్రేమేయం ఉందని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018లో ఓ పెండ్లి వేడుకలో అంజలి, సంజయ్‌లకు పరిచయం ఏర్పడింది. ఆ పెండ్లిలో సంజయ్ వెయిటర్‌గా పనిచేయడానికి వచ్చాడు. అంజలి, సంజయ్ ల మధ్య మాటామాటా కలిసి కొద్దిసేపటికే మంచి పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి వెళ్లిపోయేటప్పుడు సంజయ్ తన ఫోన్ నెంబర్ ను అంజలికి ఇచ్చాడు. అయితే, అప్పటికి అంజలి వద్ద ఫోన్ లేకపోవటంతో వారి బంధానికి తెరపడిపోయింది. ఇలా ఏడేళ్లు గడిచి పోయాయి.
2024లో అంజలి కొత్త ఫోన్ కొనుగోలు చేసింది. ఆ ఫోన్ నుంచి సంజయ్‌కు ఫోన్ చేసింది. దీంతో వారిద్దరి మధ్య మళ్లీ మాటలు కలిశాయి. తరచూ వారు ఫోన్లో మాట్లాడుకుంటుండేవారు. అంజలి వేరే వ్యక్తిని ప్రేమిస్తుందని కుటుంబ సభ్యులు గుర్తించారు. అయినా, ఆశిష్ కుమార్ తో పెళ్లి చేశారు. పెండ్లి తరువాత అంజలి భర్తతో కలిసి రావ్లా వెళ్లిపోయింది. అంజలి పుట్టింటి నుంచి రావ్లాకు 225 కిలోమీటర్ల దూరం ఉంది. అత్తింటికి వెళ్లినా కూడా సంజయ్‌తో అంజలి టచ్‌లో ఉంది. వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు.
ఆశిష్ కుమార్ హత్య జరగడానికి 16రోజుల ముందు అంజలి పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో సంజయ్, అంజలి నేరుగా కలుసుకోకపోయినా వాట్సాప్ ద్వారానే మర్డర్ ప్లాన్ చేశారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా జనవరి 30న రాత్రి భోజనం చేసిన తరువాత వాకింగ్‌కు వెళదామని భర్తను అంజలి కోరింది. అందుకు అతను ఒప్పుకోవడంతో వాహనంపై కొద్దిదూరం వెళ్లారు. ఆ సమయంలో వారున్న లొకేషన్ ను అంజలి తన ప్రియుడు సంజయ్ కు షేర్ చేసింది. సంజయ్ తన ఇద్దరు మిత్రులు రోహిత్, సిద్ధార్థ్‌లతో కలిసి అంజలి, ఆశిష్ ఉన్న లొకేషన్ కు చేరుకున్నారు. ఆ తరువాత సంజయ్, అతని మిత్రులు ఆశిష్ పై దాడిచేసి హత్య చేశారు. ఆ తరువాత ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో చివరకు అందరూ దొరికిపోయారు.
