రజినీకాంత్ ఆలోచించి మాట్లాడు: స్టాలిన్

తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే.. నటుడు-రాజకీయ నాయకుడు రజినీకాంత్ ను ఆలోచించి మాట్లాడాలని సూచించింది. పెరియార్ రామసామీ పై చేసిన కామెంట్లు విమర్శలకు దారి తీస్తున్న తరుణంలో ఈ సూచనలు చేసింది. రజినీ.. ఆయన చేసిన కామెంట్లలో తప్పులేదని తాను క్షమాపణ చెప్పేదిలేదని మంగళవారం వెల్లడించారు.
నేను చేసిన వ్యాఖ్యలు నేను రాసుకున్నవి కాదని…. వాటిపై పత్రికల్లో కధనాలు కూడా వచ్చాయని, కావాలంటే వాటిని చూపిస్తానని ఆయన చెప్పారు. వీటిపై డీఎంకే అధినేత స్టాలిన్ మాట్లాడుతూ.. ‘నా ఫ్రెండ్ రజినీకాంత్ రాజకీయ నాయకుడు కాదు. అతనొక నటుడు. పెరియార్ గురించి ఆలోచించి మాట్లాడమని నేను నిన్ను కోరుతున్నా’ అని స్టాలిన్ తెలిపారు.
జనవరి 14న జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్.. 1971 లో జరిగిన ర్యాలీలో పెరియార్ సీతారాముల విగ్రహాలను అభ్యంతరకరంగా ఊరేగించారని వ్యాఖ్యానించినట్లు ఓ పత్రికలో ప్రచురితమైంది. పెరియార్ గురించి రజనీకాంత్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ద్రవిడర్ విడుదలై కళగమ్ (డీవీకే) పోలీసులకు కంప్లైంట్ చేసింది. పెరియార్ ప్రతిష్ట దెబ్బతినేలా రజనీ వ్యాఖ్యానించారని మండిపడింది.
అప్పటి నుంచి తమిళనాడులో రజనీకి వ్యతిరేకంగా ద్రవిడ సంఘాలు నిరసన తెలుపుతూనే ఉన్నాయి. కాగా ….తంతై పెరియార్ ద్రవిదార్ కజగం నాయకులు రజనీకాంత్ ఇంటి వద్ద మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు.