Bengaluru Blast : రామేశ్వరం కేఫ్ బాంబు బ్లాస్ట్​ దర్యాప్తు ముమ్మరం.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత వ్యక్తి గుర్తింపు

కేఫ్ లోకి వచ్చిన అనుమానాస్పద వ్యక్తి కౌంటర్ లో కూపన్ తీసుకున్నట్లు సీసీటీవీ పుటేజీల్లో ఉంది. రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేశాడు.

Bengaluru Blast : రామేశ్వరం కేఫ్ బాంబు బ్లాస్ట్​ దర్యాప్తు ముమ్మరం.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అనుమానిత వ్యక్తి గుర్తింపు

Bengaluru Bomb Blast : బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే రామేశ్వరం కేఫ్ లో సీసీటీవీ పుటేజ్ పరిశీలించిన ఎన్ఐఏ.. బ్యాగ్ తో కేఫ్ లోకి వెళ్లిన పలువురు అనుమానితులను గుర్తించారు. రామేశ్వరం ఘటనలో ఉగ్రకోణం ఉందని ఎన్ఐఏ భావిస్తోంది. సంఘటనకు సంబంధించిన ప్రతీఅంశాన్ని విచారణ చేస్తున్నారు. బెంగళూరు ఘటనతో హైదరాబాద్ లోనూ పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. జూబ్లీబస్టాండ్, ఎంజీబీఎస్ తోపాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.. రద్దీ ప్రాంతాలతోపాటు మాల్స్ లో కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

Also Read : బెంగళూరులోని కేఫ్‌లో పేలుడు కలకలం

రామేశ్వరం కేఫ్ ఘటనలో విచారణ చేస్తున్న పోలీసులు సీసీ పుటేజ్ లలో బ్యాగుతో వెళ్తున్న అనుమానాస్పద వ్యక్తిని గుర్తించారు. ఉదయం 11.30 గంటలకు అనుమానాస్పద వ్యక్తి బ్యాగ్ తో కేఫ్ లోకి వచ్చినట్లు గుర్తించారు. అప్పటి నుంచి పేలుడు జరిగిన (మధ్యాహ్నం 12.56) సమయం వరకు కేఫ్ లో, కేఫ్ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సీసీ పుటేజీల్లో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితుడు కేఫ్ నుంచి బయటకు రాగానే 100 మీటర్ల దూరం తరువాత సీసీ టీవీల్లో కనిపించకుండా పోయాడని ఇప్పటి వరకు జరిపిన విచారణలో తేలింది. అయితే, పోలీసులు అనుమానాస్పద నెంబర్లను ట్రాక్ చేస్తున్నారు. బాంబు పేలుడు సమయంలో స్విచ్ ఆఫ్ చేసిన నెంబర్లపై దృష్టిసారిస్తున్నారు. సీసీ టీవీ పుటేజీల ఆధారంగా నిందితుడిగా భావిస్తున్న వ్యక్తికి 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.అతడు తెల్లటి టోపీ, ముసుగు ధరించి, భుజంపై బ్యాగ్ ను పెట్టుకొని కేఫ్ వైపు వెళ్తున్నట్లు సీసీ టీవీ పుటేజ్ లలో గుర్తించారు.

Also Read : Radisson Blu drugs case : పోలీసుల విచారణలో క్రిష్ ఏమి చెప్పాడు? పాజిటివ్ తేలితే అరెస్ట్ చేసే అవకాశం

కేఫ్ లోకి వచ్చిన అనుమానాస్పద వ్యక్తి కౌంటర్ లో కూపన్ తీసుకున్నట్లు సీసీటీవీ పుటేజీల్లో ఉంది. రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. రవ్వ ఇండ్లీ తిని బాంబు ఉన్న బ్యాగును కేఫ్ లోనే చెట్టుపక్కన ఉంచి వెళ్లిపోయాడు. నిందితుడి ఆచూకీకోసం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.