Job offer: ఐఐటీ, ఐఐఎంలో చదవకపోయినా రూ.85 లక్షల ప్యాకేజీతో జాబ్ సాధించిన అమ్మాయి

ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రాశి బగ్గా బీటెక్ చదివింది.

Job offer: ఐఐటీ, ఐఐఎంలో చదవకపోయినా రూ.85 లక్షల ప్యాకేజీతో జాబ్ సాధించిన అమ్మాయి

Rashi Bagga

Rashi Bagga: నైపుణ్యాలు ఉంటే ఉద్యోగ అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదవకపోయినా కొందరు విద్యార్థులు లక్షలాది రూపాయల వేతనాలతో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. రాశి బగ్గా అనే అమ్మాయి కూడా ఇలాంటి ఘనతే సాధించింది.

ఛత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో రాశి బగ్గా బీటెక్ చదివింది. ఏడాదికి 85 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించింది. ఆ ఇన్‌స్టిట్యూట్లో ఈ ఏడాది ఇప్పటివరకు ఇంత పెద్ద ప్యాకేజీతో మరెవరికీ ఉద్యోగం రాలేదు.

ఈ ఉద్యోగం రాకముందు కూడా మరొక కంపెనీ కూడా ఆమెకు ఓ ఆఫర్‌ ఇచ్చింది. జాబ్ మార్కెట్‌లో తన ప్రతిభను పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆమె పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. ఈ జాబ్ ఆఫర్ పొందకు ముందు ఆమె బెంగళూరులోని ఇంట్యూట్‌లో ఎస్డీఈ ఇంటర్న్, అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఇంటర్న్‌గానూ చేసింది.

ఈ ఏడాది జులై నుంచి అట్లాసియన్ లో ఆహె ప్రాడక్ట్ సెక్యూరిటీ ఇంజనీర్ గా పనిచేస్తోంది. గత ఏడాది ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన చింకీ కర్దా అనే విద్యార్థి రూ.57 లక్షల వార్షిక ప్యాకేజీతో జాబ్ సాధించారు.

Israel-Gaza war: యుద్ధంలో భారతీయురాలికి తీవ్ర గాయాలు.. తల్లికి ఫోన్ చేసి ఏం చెప్పిందో తెలుసా?