రామాయణం చెప్పిన రావణుడి సీక్రెట్స్.. లంకలో తొలి పైలట్ అనేందుకు 100కు పైగా ఆధారాలు ఇవే!

  • Published By: sreehari ,Published On : July 25, 2020 / 06:15 PM IST
రామాయణం చెప్పిన రావణుడి సీక్రెట్స్.. లంకలో తొలి పైలట్ అనేందుకు 100కు పైగా ఆధారాలు ఇవే!

Updated On : July 25, 2020 / 7:17 PM IST

శ్రీలంకలో రావణుడే తొలి పైలట్ అనేందుకు 100 మందికి పైగా ఆధారాలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఆ ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం. రామాయణంలో విలన్ అయిన రావణుడు… శ్రీలంకను పరిపాలించాడని ప్రతీతి. అక్కడి ప్రజలకు రావణుడు అంటే ఎంతో భక్తి. ఆయన గొప్ప రాజే కాక… గొప్ప సాహిత్యవేత్త అని లంకేయులు నమ్ముతున్నారు.

అంతేకాదు… రావణుడు 5వేల ఏళ్ల కిందట పుష్పక విమానం లాంటి దాంట్లో రివ్వున దూసుకుపోయేవాడనీ అంటారు. ఆ విమానానికి ఆయనే పైలట్‌లా ఉంటూ దాన్ని నడిపేవాడని లంకేయులు నమ్ముతున్నారు. విమానంలో వెళ్లాడే గానీ… సీతాదేవిని మాత్రం కిడ్నాప్ చెయ్యలేదన్నది లంకేయుల మాట.

అది అలా ఉంచితే… అసలు రావణుడి దగ్గరున్న పుష్పక విమానం ఎలాంటిది? దాన్ని ఆయన ఎలా నడిపేవాడు? ఆ విమానం ఆ రోజుల్లో అత్యంత వేగంగా ఎలా వెళ్లేది? దానికి ఉన్న టెక్నాలజీ ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటోంది శ్రీలంక పౌరవిమానయాన శాఖ. వచ్చే ఐదేళ్లలో దీన్ని ఆధారాలతో నిరూపించాలనుకుంటోంది.

గతేడాది… పౌరవిమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురాతత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఖగోళ వేత్తలు… శ్రీలంకలోని అతి పెద్ద బండారునాయకే విమానాశ్రయం ఉన్న చోట… కతునాయకే దగ్గర కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో… 5000 ఏళ్ల కిందట… రావణుడు ఆకాశంలో విహరించాడని తేల్చారు.

ఐతే… రావణుడు సీతాదేవిని కిడ్నాప్ చేశాడన్న అంశాన్ని కొట్టిపారేశారు. భారతీయులు అలా చెప్పుకుంటున్నారనీ, రావణుడు మంచి రాజు అని వారు అన్నారు. ఇప్పుడు రావణుడిపై శ్రీలంకలో ఆసక్తి బాగా పెరిగింది. ఈ మధ్య పంపిన ఓ శాటిలైట్ పేరు కూడా రావణ అనే పెట్టారు.

ఒక్క ఆధారమైనా ఉందా అనే డౌట్ ఉన్న సమయంలో… ఏకంగా 100 మంది ఆధారాలు చూపిస్తామని ముందుకు రావడం సంతోషంగా ఉందని లంక పౌరవిమాన శాఖ తెలిపింది. పురాణాల ప్రకారం.. క్రీస్తు శకం 2517లో రావణుడు లంకను పరిపాలించాడు. ఆయన లెక్కల్లో ప్రావీణ్యుడు. పట్టణీకరణపై పట్టుంది. అందుకే ఆయన్ని భారతీయులు సైతం మహా బ్రహ్మ లేదా గొప్ప బ్రాహ్మణుడు అని చెప్పేవారు.

తాజాగా ముందుకొచ్చిన 100 మందిలో చరిత్రకారులు, పౌరవిమానయాన నిపుణులు, పురాతత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, ఖగోళవేత్తలు అందరూ ఉన్నారని తెలిసింది. బ్రిటీష్ మ్యూజియంలో 18వ శతాబ్దంలో చెక్కిన పది తలల రావణాసురుడి విగ్రహం ఉంది. దాని ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంది. లంక ప్రభుత్వం ఆధారాలతో నిరూపించగలిగితే… విమానంలో మొదటిసారి ప్రయాణించినట్లు రైట్ సోదరుల పేరున ఉన్న రికార్డు… రావణుడి సొంతం అవుతుంది.