అంధుల కోసం యాప్ రిలీజ్ చేసిన RBI

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 09:07 AM IST
అంధుల కోసం యాప్ రిలీజ్ చేసిన RBI

Updated On : January 2, 2020 / 9:07 AM IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ అంధుల కోసం ఓ కొత్త యాప్ ను బుధవారం(జనవరి1,2020) రీలీజ్ చేశారు. కరెన్సీ నోట్లను గుర్తించడంలో ఇబ్బందులు పడుతున్న అంధుల కోసం మణి(MANI)పేరుతో మెుబైల్ యాప్ ను తయారు చేసింది ఆర్ బీఐ. 

MANI అంటే ‘మెుబైల్ ఎయిడెడ్ నోట్ ఐడెంటిఫయర్’. మెుబైల్ సహాయంతో నోట్లను గుర్తించే యాప్ అని అర్ధం. ఈ యాప్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేస్తే చాలు, ఇంటర్ నెట్ లేకపోయినా పని చేస్తోందని ఆర్ బీఐ తెలిపింది. ‘MANI’ యాప్ ను ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, IOS స్టోర్స్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా కరెన్సీ నోట్లను మెుబైల్ ఫోన్ లోని కెమెరా సహాయంతో స్కాన్ చేస్తే చాలు, ఎన్ని రూపాయల నోటు అన్న విషయం తెలుస్తుంది. హిందీ, ఇంగ్లీష్ భాషలలో ఆడియో ఓౌట్ పుట్ ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016 నోట్ల రద్దు తర్వాత ‘మహాత్మా గాంధీ సిరీస్’ తో రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000  కొన్ని మార్పులతో కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ కొత్త నోట్లను గుర్తించడంలో అంధుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి వారి ఇబ్బందులను గుర్తించి ఈ యాప్ ను తయారు చేసినట్లు తెలిపింది. అయితే ఈ యాప్ ద్వారా నోటు ఒరిజినల్, డూప్లికేటో గుర్తించటం సాధ్యం కాదని ఆర్ బీఐ తెలిపింది.