Amarinder Singh : అమరీందర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన బీజేపీ

అమరీందర్ సింగ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని బీజేపీ యాక్సెప్ట్ చేసింది. త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని, వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకి

Amarinder Singh :  అమరీందర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసిన బీజేపీ

Njp

Updated On : October 20, 2021 / 5:39 PM IST

Amarinder Singh అమరీందర్ సింగ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ని బీజేపీ యాక్సెప్ట్ చేసింది. త్వరలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని, వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకి సిద్ధమని అమరీంద్ సింగ్ మంగళవారం చేసిన ప్రకటనపై ఇవాళ బీజేపీ స్పందించింది. అమరీందర్ సింగ్ పార్టీతో పొత్తుకి తాము సిద్ధమని పంజాబ్ బీజేపీ చీఫ్ దుష్యంత్ గౌతమ్ బుధవారం ప్రకటించారు.

పొత్తుకి తమ డోర్లు తెరిచే ఉన్నాయని,అయినప్పటికీ తమ పార్లమెంటరీ బోర్డు మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోగలదని దుష్యంత్ గౌతమ్ తెలిపారు. జాతీయవాద,దేశం గురించి ఆలోచించే మరియు జాతీయ భద్రత గురించి ఆలోచించే పార్టీలతో చేతులు కలిపేందుకు బీజేపీ ఎల్లప్పుడూ రెడీగానే ఉంటుందన్నారు.

ALSO READ  Amarinder Singh : రాష్ట్రంలో మరో కొత్త పార్టీ.. బీజేపీతో పొత్తుపై మాజీ ముఖ్యమంత్రి కీలక ప్రకటన