Akash Ambani: ఉద్యోగుల పని గంటలపై ఆకాశ్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాకు అదే ముఖ్యం అంటూ..
ఉద్యోగుల పని గంటల విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నవేళ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ స్పందించారు.

Akash Ambani
Akash Ambani: ఉద్యోగుల పని గంటల విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కొన్ని నెలల క్రితం ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రపంచ దేశాలతో భారతదేశం పోటీపడాలంటే.. మన దేశంలోని యువత వారానికి 70గంటలు తప్పనిసరిగా పనిచేయాలని నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను కొందరు సమర్ధించగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇటీవల ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎస్ సుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ.. వారానికి 90గంటలు పనిచేయాలంటూ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
Also Read: March New Rules : బిగ్ అలర్ట్.. మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. ఏయే మార్పులు జరిగాయో తెలుసుకోండి..
క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో అశ్విన్ యార్ది ఉద్యోగుల పనిగంటల విషయంపై స్పందిస్తూ.. రోజుకు 9.30గంటల చొప్పున వారానికి ఐదు రోజులు పనిచేస్తే చాలని వెల్లడించారు. అంతేకాదు.. ఉద్యోగులకు వీకెండ్స్ లలో ఈ-మెయిల్స్ పంపొద్దని కంపెనీలకు అశ్వినీ యార్ది హితవు పలికారు. తాను ఇదే సూత్రాన్ని గత నాలుగేళ్లుగా పాటిస్తున్నానని అన్నారు. తాజాగా ఉద్యోగుల పని గంటల విషయంపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ముంబయి టెక్ వీక్ ఈవెంట్ లో ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ..‘‘ఒక ఉద్యోగి ఆఫీసులో పనిచేసే గంటల సంఖ్యను చూడను.. రోజువారీ పని నాణ్యతే తనకు ముఖ్యం’’ అని ఆకాశ్ అంబానీ అన్నారు. జీవితంలో పని, కుటుంబం తనకు అతిపెద్ద ప్రాధాన్యతలు. ప్రతిఒక్కరూ తమ ప్రాధాన్యతలను తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఆకశ్ అంబానీ పేర్కొన్నారు.