March New Rules : బిగ్ అలర్ట్.. మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. ఏయే మార్పులు జరిగాయో తెలుసుకోండి..

మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలలో నామినేషన్ నిబంధనలలో సెబీ పెద్ద మార్పు చేసింది.

March New Rules : బిగ్ అలర్ట్.. మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. ఏయే మార్పులు జరిగాయో తెలుసుకోండి..

Updated On : March 1, 2025 / 1:47 AM IST

March New Rules : మార్చి నెల వచ్చేసింది. ఈ కొత్త నెలలో కొత్త రూల్స్ వచ్చేశాయి. పలు అంశాల్లో మార్పులు జరిగాయి. మరి, కొత్తగా వచ్చి రూల్స్ ఏంటి, ఏయే మార్పులు జరిగాయి, అవి మన జీవితాలపై ఏ విధంగా ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల కోసం SEBI కొత్త నిబంధనలు, LPG సిలిండర్ ధర సవరణలు, యూపీఐ ద్వారా బీమా ప్రీమియం చెల్లింపులు.. మార్చి నెలలో ముఖ్యమైన మార్పులు ఇవే..

బీమా ప్రీమియం కోసం కొత్త UPI చెల్లింపు నియమాలు..
బీమా ప్రీమియం చెల్లించడం మరింత సులభం కానుంది. IRDAI ప్రీమియం చెల్లింపు కోసం కొత్త సదుపాయాన్ని ప్రకటించింది. దీని పేరు Bima-ASBA. ఈ సదుపాయం మార్చి 1, 2025 నుండి ప్రారంభమవుతుంది. ఈ సదుపాయం UPI ఆధారంగా ఉంటుంది. UPIని ఉపయోగిస్తున్న కోట్ల మంది ప్రజలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోగలరు.

UPI వినియోగదారులు Bima-ASBA సౌకర్యం ద్వారా బీమా ప్రీమియంలను చెల్లించే ఎంపికను కలిగి ఉంటారు. ఈ ఫీచర్.. పాలసీదారులను ప్రీమియం చెల్లింపుల కోసం వారి ఖాతాల్లో డబ్బును ఆదా చేసుకోవడానికి అనుమతిస్తుంది. పాలసీ ఆమోదించబడినప్పుడు మాత్రమే చెల్లింపులు జరుగుతాయి.

ఎల్ పీజీ ధరల సవరణ..
చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటవ తేదీన ఎల్ పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తాయి. మార్కెట్ కు అనుగుణంగా ధరల్లో మార్పులు ఉండే ఛాన్స్ ఉంది. సవరించిన ధరలు ఉదయం ఆరు గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ఎయిర్ టర్బైన్ ఇంధనం, CNG, PNG ధరలను సైతం చమురు కంపెనీలు సవరిస్తాయి.

Also Read : బంగారం ధరలు ఉన్నట్టుండి ఎందుకు తగ్గుతున్నాయి? విశ్లేషకులు ఏమంటున్నారు?

FDపై వడ్డీ రేట్లలో మార్పు..
FD పై వడ్డీ రేట్లలో మార్పులు జరగొచ్చు. వడ్డీ రేటు పెరగొచ్చు లేదా తగ్గవచ్చు. RBI ఇటీవల REO రేట్లను తగ్గించాలని నిర్ణయించిన తర్వాత చాలా బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సర్దుబాటు చేశాయి. మార్చి 1 న మరిన్ని బ్యాంకులు FD వడ్డీ రేట్లను సవరించాలని భావిస్తున్నాయి. ఈ సవరణలు పొదుపు రాబడిపై ప్రభావం చూపుతాయి.

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు సెబీ కొత్త నిబంధనలు..
మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాలలో నామినేషన్ నిబంధనలలో సెబీ పెద్ద మార్పు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఇప్పుడు పెట్టుబడిదారులు తమ డీమ్యాట్ ఖాతాలు లేదా మ్యూచువల్ ఫండ్ ఫోలియోలలో గరిష్టంగా 10 మందిని నామినీలుగా చేసుకోవచ్చు. ఈ నిబంధన మార్చి 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది.

మ్యూచువల్ ఫండ్ ఫోలియోలు, డీమ్యాట్ ఖాతాల కోసం నామినేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కొత్త నిబంధనలను జారీ చేసింది.

కొత్త మార్పులు:
* పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్, డీమ్యాట్ ఖాతాల కోసం గరిష్టంగా 10 మంది వ్యక్తులను నామినేట్ చేయవచ్చు.
* క్లెయిమ్ చేయని ఆస్తులను నివారించడానికి సింగిల్ హోల్డర్ ఖాతాలకు నామినేషన్ తప్పనిసరి.
* పెట్టుబడిదారు పాన్, ఆధార్ (చివరి నాలుగు అంకెలు) లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌తో సహా నామినీ వివరాలను అందించాలి.
* ఉమ్మడి ఖాతాలో సర్వైవర్‌షిప్ నిబంధనల ప్రకారం ఆస్తులు సర్వైవింగ్ అకౌంట్ కు బదిలీ చేయబడతాయి.

UANని యాక్టివేట్ చేయడానికి గడువు మార్చి 15..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని యాక్టివేట్ చేయడానికి, బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని మార్చి 15 వరకు పొడిగించింది. EPFO ELI స్కీమ్ ప్రయోజనాన్ని పొందడానికి ఈ పని చేయడం అవసరం.

14 రోజులు బ్యాంకులకు సెలవులు..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం మార్చిలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకులో మీకు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే.. బ్యాంకు సెలవుల జాబితాను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.