రోడ్డు ప్రమాదంలో ప్రముఖ రచయిత కన్నుమూత

శ్రీలంకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ప్రముఖ రచయిత ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ గంగా ప్రసాద్ విమల్(80) చనిపోయారు.
గంగా ప్రసాద్ విమల్ తన కుటుంబ సభ్యులతో పాటు దక్షిణ గోలె టౌన్ నుంచి కొలంబోకు ఒక కారులో వెళుతుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగ ప్రసాద్ విమల్‌తో పాటు ఇద్దరు కుటుంబ సభ్యులు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కూడా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. అతను పశ్చిమ శ్రీలంకలోని వడ్డువా టౌన్‌కు చెందిన వ్యక్తి. శ్రీలంక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాహనం నడుపుతున్న డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ఒక ట్రక్కును ఢీ కొట్టాడు. దాంతో ప్రమాదం జరిగింది.
ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పట్టణమైన ఉత్తర కాశీలో 1939లో విమల్ జన్మించారు. అతను అనేక కవితా సంకలనాలు, చిన్న చిన్న కథలు, నవలలు హిందీలో రాశాడు. అతని చివరి నవల మనుష్ఖోర్ 2013లో ప్రచురించబడింది. ఆయనకు అనేక హిందీ సాహిత్య పురస్కారాలు లభించాయి.