PoKలో ఉగ్రస్థావరాలపై భారత్ లక్షిత దాడులు!

  • Published By: venkaiahnaidu ,Published On : November 19, 2020 / 08:21 PM IST
PoKలో ఉగ్రస్థావరాలపై భారత్ లక్షిత దాడులు!

Updated On : November 19, 2020 / 8:49 PM IST

Indian Army’s action in PoK fake పాక్ ఆక్రమిత కశ్మీర్(POK) లోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్స్ పై భారత భద్రతా దళాలు మొరుపుదాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్లు, ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచరం మేరకు పీవోకేలోని టెర్రర్ లాంఛ్ ప్యాడ్స్ పై భారత ఆర్మీ పిన్ పాయింట్ దాడులు చేపట్టినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఇండియన్ ఆర్మీ డైరక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్ తెలిపారు.



కాగా, కశ్మీర్​లోకి ఉగ్రవాదులను పంపేందుకు పాకిస్థాన్ సైన్యం చేస్తున్న ప్రయత్నాలను భారత్​ సమర్థంగా తిప్పికొడుతోంది. పాకిస్థాన్​ ఆక్రమిత కశ్మీర్​లోని టెర్రర్​ లాంచ్​ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత దాడులు చేస్తోంది. భారత సైనిక వర్గాలు ఈమేరకు వెల్లడించినట్టు చెబుతూ ఇవాళ కొన్ని జాతీయ వార్తా సంస్థలు కథనం ప్రచురించాయి.



అయితే లక్షిత దాడులు జరిగాయని భారత సైన్యం నిర్ధరించలేదు. నేడు నియంత్రణ రేఖ వద్ద ఎలాంటి కాల్పులు జరగలేదని ఆర్మీ స్పష్టంచేసింది.