Republic Day : బీటింగ్ రీట్రీట్‌లో వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన..లేజర్ షో
గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే శకటాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తమ శకటాలను ప్రదర్శించాలని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు...

Drones
Beating Retreat Thousand Drone : గణతంత్ర వేడుకల్లో భాగంగా ఢిల్లీలో నిర్వహించే బీటింగ్ రీట్రీట్‌లో ఈసారి వెయ్యి డ్రోన్లతో ప్రదర్శన చేపట్టనున్నారు. ఐఐటీ ఢిల్లీకి చెందిన బోట్‌ల్యాబ్ డైనమిక్స్ అనే అంకుర సంస్థ దీన్ని నిర్వహించనుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటాల ఇతివృత్తంగా ఈ ప్రదర్శనను రూపొందిస్తున్నారు. అంతేకాకుండా తొలిసారి నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ గోడలపై లేజర్ షో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read More : Chintamani Natakam : చింతామణి నాటకం నిషేధంపై కళాకారుల నిరసన
బీటింగ్ రీట్రీట్‌లో డ్రోన్ల ప్రదర్శన, లేజర్ షో ఉండటం ఇదే మొట్టమొదటి సారి అని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించాయి. ఇప్పుడు ఆ జాబితాలో చేరే నాలుగో దేశంగా భారత్ నిలువనుంది. గణతంత్ర దినోత్సవ వేడుకలను జనవరి 23 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.
Read More : ICMR : జాగ్రత్తలు పాటించండి.. లేకపోతే మార్చి 11 తర్వాత సముహ వ్యాప్తి తప్పదు!
ఇటు గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించే శకటాలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. తమ శకటాలను ప్రదర్శించాలని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు చేసిన విజ్ఞప్తిని రక్షణ శాఖ తిరస్కరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్‌లు ప్రధానిని కోరినప్పటికీ.. నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి 12 రాష్ట్రాలకే ఆ అవకాశం కల్పిస్తున్నామని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.. మమతా బెనర్జీ, స్టాలిన్‌కి లేఖ ద్వారా సమాధానమిచ్చారు.