రిటైర్డ్ న్యాయమూర్తులు..రాజకీయాలు

సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నియమితులు కావడంపై పొలిటికల్‌గా హాట్ టాపిక్ అయ్యింది. న్యాయమూర్తులు పదవీ విరమణ తర్వాత రాజకీయ పదవులు లభించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. గొగోయ్ పదవి విరమణ చేసిన నాలుగు నెలల తర్వాత..రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అయోధ్య లాంటి వివాదాస్పద విషయంలో తీర్పును వెలువరించరాయన.
1984లో సిక్కుల అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి క్లీన్ చిట్ ఇచ్చిన జస్టిస్ రంగనాథ్ మిశ్రాను ఆ పార్టీ 1998లో రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈయన 2004 వరకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మాజీ సీజేఐ మహ్మద్ హిదాయుతుల్లా పదవీ విరమణ అనంతరం 9 ఏళ్ల తర్వాత.. ఉప రాష్ట్రపతి అయ్యారు. గొగోయ్ మాదిరిగా..మాజీ సీజీఐ పి.సతశివం..పదవీ విరమణ చేసిన నాలుగు నెలల్లో 2014లో గవర్నర్‌గా మారారు.
రిటైర్డ్ న్యాయమూర్తుల నియామకం చేయడం వివాదంగా మారుతోంది. రిటైర్డ్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ గౌర్ గత సంవత్సరం పదవీ విరమణ ఛేశారు. వారం రోజుల తర్వాత..అప్పీలేట్ ట్రిబ్యునల్ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఈయన మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం సీబీఐ అరెస్టుకు మార్గం సుగమం చేశారు. నకిలీ ఎన్ కౌంటర్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న అమిత్ షా కేసు విషయంలో..మాజీ సీజేఐ సతశివంను కేరళ గవర్నర్‌గా నియమించడంపై హాట్ హాట్ చర్చలు జరిగాయి.
న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత..ప్రభుత్వం చూపించే ఉపాధి కోసం ఎదురు చూడడం, అంగీకరించడం కరెక్టు కాదని మొదటి లా కమిషన్ తన 14వ నివేదిక (1958)లో వెల్లడించింది. ఇది న్యాయవ్యవస్థ అని, స్వాతంత్ర్యాన్ని ప్రభావితం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
Read More : రిటైర్ జడ్జీలు ‘రిటైర్’ ఎందుకు కావడం లేదు..నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు