హీరో సుశాంత్‌ మృతి కేసు నుంచి రీనా ఎలా బయటపడింది? ప్రేమలో పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది?

సుశాంత్ మృతి కేసులో ఈడీ, సీబీఐ, ఎన్సీబీ దర్యాప్తు జరిపాయి. 

హీరో సుశాంత్‌ మృతి కేసు నుంచి రీనా ఎలా బయటపడింది? ప్రేమలో పడ్డప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది?

Updated On : March 23, 2025 / 7:17 PM IST

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో సీబీఐ ముంబై కోర్టులో క్లోజర్‌ రిపోర్ట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసు ముగిసింది. సుశాంత్ మృతి తర్వాత అతడి గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిపై సుశాంత్‌ తండ్రి ఓ కేసు పెట్టారు. అలాగే, సుశాంత్ ఫ్యామిలీపై రియా చేసిన ఆరోపణలతో మరో కేసు ఉంది.

ఆయా ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో సుశాంత్‌ మృతిపై అనుమానాలకు ఆధారాలూలేవంటూ సీబీఐ క్లోజర్‌ రిపోర్ట్‌ను సమర్పించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొన్న రియా చక్రవర్తి ఊపిరి పీల్చుకుంది. ఈ హై ప్రొఫైల్ కేసు 2020 నుంచి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుశాంత్‌ కేసులో మొదటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసా?

ప్రేమ
రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2019 ఏప్రిల్‌లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బిజినెస్‌లోనూ భాగస్వామ్యమయ్యారు. వారితోపాటు వ్యాపార భాగస్వామిగా రియా సోదరుడు షోయిక్‌ కూడా ఉన్నాడు. వారు ముగ్గురూ కలిసి 2019 సెప్టెంబర్‌లో ఏఐ స్టార్టప్‌ వివిడ్రేజ్ రీయాలిటీఎక్స్‌ను స్థాపించారు. అదే ఏడాది డిసెంబర్ నాటికి సుశాంత్, రియా మధ్య బంధం మరింత బలపడింది.

సుశాంత్ మృతి
సుశాంత్ తన ముంబై అపార్ట్‌మెంట్‌లో 2020 జూన్ 14న మృతి చెందాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక నివేదికలు సూచించాయి. అతనితో నివసించి రియా అతడి మృతికి వారం ముందు ఆ అపార్ట్‌మెంట్‌ నుంచి వెళ్లిపోయింది.

రీనాపై ఎఫ్‌ఐఆర్‌
సుశాంత్ మృతి తర్వాత నెలరోజులకు అతడి తండ్రి కేకే సింగ్ పట్నాలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. తన కుమారుడి ఆత్మహత్యకు రియానే కారణమని, ఆర్థిక మోసాలకు పాల్పడిందని, రూ.15 కోట్ల వ్యాపారం విషయంలో మోసం చేసిందని ఆరోపించారు.

ఏజెన్సీల దర్యాప్తు
సుశాంత్ మృతి కేసులో ఈడీ, సీబీఐ, ఎన్సీబీ దర్యాప్తు జరిపాయి.
2020 ఆగస్టు 7: మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రియా, షోయిక్‌లను ప్రశ్నించింది.
2020 ఆగస్టు 19: సుప్రీంకోర్టు ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాదకద్రవ్యాల అంశంపై కైడా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది.

రియా కౌంటర్ ఎఫ్‌ఐఆర్‌
సుశాంత్ సోదరీమణులు ప్రియాంక, మీతు సింగ్‌లతో పాటు ఒక వైద్యుడిపై రియా 2020 సెప్టెంబర్ 7న ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. సుశాంత్ మరణానికి కొన్ని రోజుల ముందు వారు నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్‌ను సృష్టించారని ఆమె ఆరోపించింది.

అరెస్టు.. జైలు..
సుశాంత్ కోసం రియా డ్రగ్స్ కొన్నారన్న ఆరోపణలపై 2020 సెప్టెంబర్ 8న ఎన్సీబీ రియాను అరెస్టు చేసింది. 2020 అక్టోబర్ 7న బాంబే హైకోర్టులో ఆమెకు బెయిల్ మంజూరైంది.

కీలక పరిణామాలు
2021 ఫిబ్రవరి: బాంబే హైకోర్టు మీతు సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేసింది. కానీ, ప్రియాంక సింగ్‌పై దర్యాప్తు కొనసాగించడానికి సీబీఐకి అనుమతించింది.
2021 మార్చి: మాదకద్రవ్యాల ఆరోపణలకు సంబంధించి ఎన్సీబీ రియా, షోయిక్, ఇతరులపై చార్జిషీట్ దాఖలు చేసింది.

తుది తీర్పు
2024 అక్టోబర్: రియా, ఆమె కుటుంబంపై లుకౌట్ సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
2025 మార్చి: సుశాంత్‌ మృతిపై అనుమానాలకు ఎలాంటి ఆధారాలూ లేవని సీబీఐ తుది నివేదిక ఇచ్చింది. ఆత్మహత్యకు ప్రేరేపించారనేందుకు ఆధారాలు లభ్యం కాలేదని చెప్పింది. రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబానికి క్లీన్‌ చిట్‌ దక్కింది.