Antony Blinken : దలైలామా ప్రతినిధితో అమెరికా విదేశాంగ మంత్రి భేటీ
భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం(జులై-28,2021)ఉదయం ఢిల్లీలో బౌద్ద ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రతినిధి నోడుప్ డాంగ్‌చుంగ్‌తో భేటీ అయ్యారు.

Antony Blinken
Antony Blinken భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం(జులై-28,2021)ఉదయం ఢిల్లీలో బౌద్ద ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇతర పౌర సమాజ నేతలతో పాటుగా దలైలామా ప్రతినిధి నోడుప్ డాంగ్‌చుంగ్‌తో బ్లింకన్ భేటీ అయ్యారు. బహిష్కృత టిబెటన్ ప్రభుత్వంగా పిలువబడే..సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్(CTA)ప్రతినిధిగా పనిచేస్తున్న నోడుప్ డాంగ్‌చుంగ్‌తో బ్లింకన్ సమావేశమవడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే దలైలామా ప్రతినిధితో అమెరికా మంత్రి భేటీ కావడం ఒకరకంగా చైనాకు ఆగ్రహం తెప్పించే విషయంమే. 1950లో చైనా దళాలు టిబెట్‌ను ఆక్రమించాయి. 1959లో మతగురువు దలైలామా ఆ దేశం నుంచి పారిపోయి భారత్ కు శరణార్థిగా వచ్చిన విషయం తెలిసిందే. చైనాలో టిబెట్ అంతర్భాగమని, దలైలామా తీవ్రమైన వేర్పాటువాది అని డ్రాగన్ దేశం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా,నోడుప్‌తో అమెరికా మంత్రి భేటీపై చైనా విదేశాంగ శాఖ నుంచి ఇంకా ఎటువంటి స్పందన లేదు.
మరోవైపు, ఆంటోనీ బ్లింకెన్.. ఇవాళ భారత విదేశాంగ మంత్రి జైశంకర్,భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ని కలిశారు. కోవిడ్ టీకాల సరఫరా, ఆఫ్గానిస్తాన్‌లో తాజా పరిస్థితి, దేశంలో మానవ హక్కుల అంశం,ఇండో-పసిఫిక్, ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రత పరిస్థితులపై వీరి మధ్య చర్చ జరిగినట్లు మాచారం.
ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం…న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లోని దోవల్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ చర్చల్లో దాదాపు ఓ గంటపాటు తూర్పు లడఖ్‌లో పరిస్థితులు సహా ప్రపంచంలో పెరుగుతున్న సంఘర్షణల పరిస్థితులపై మాట్లాడారు.