Road Accident: పెళ్లి వేడుకకు హాజరై వస్తుండగా విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

పంజాబ్‌లోని బటాలా సమీపంలో జలంధర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఏడాదిన్నర చిన్నారి ఉంది.

Road Accident: పెళ్లి వేడుకకు హాజరై వస్తుండగా విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Road Accident

Updated On : January 9, 2023 / 7:59 AM IST

Road Accident: పెళ్లి వేడుకలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబం మృత్యువుఒడికి చేరింది. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారు ఊహించని ప్రమాదంతో విగతజీవులుగా మారిపోయారు. వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని బటాలా సమీపంలో జలంధర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఏడాదిన్నర చిన్నారి ఉంది.

Road Accident Three Died : వివాహానికి వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం.. కారు డివైడర్ ను ఢీకొని ముగ్గురు మృతి

మృతులది చాహల్ కలాన్ గ్రామం. వీరంతా కొద్దిదూరంలోఉన్న అమృత్‌సర్ పట్టణంలో బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుకలో సంతోషంగా సందడి చేశారు. ఆల్టో కారులో ఆరుగురు తిరిగి చాహల్ కలాన్ గ్రామంకు బయలుదేరారు. బటాలా సమీపంలోని జలంధర్ రోడ్డులో వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి ముందువెళ్తున్న మోటార్ సైకిల్ ను ఢీకొట్టింది. ఆ తరువాత కారు ముందుకు వెళ్లి టిప్పర్ ను బలంగా ఢీకొట్టింది.

Road Accident In China: తూర్పు చైనాలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం.. 17మంది మృతి..

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురులో ఐదుగురు మరణించారు. కారులోని ఏడాదిన్నర బాలికకూడా మరణించింది. మరో బాలిక తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఘటన విషయంపై పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడకు చేరుకొని తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం అమృత్ సర్‌కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.