RSS Chief Mohan Bhagwat: ‘హిందువుల్లేకుండా ఇండియా లేదు.. ఇండియా లేకుండా హిందువుల్లేరు’

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ శనివారం సంచలన కామెంట్లు చేశారు. హిందువుల్లేకుండా ఇండియా లేదు.. ఇండియా లేకుండా హిందువుల్లేరని కామెంట్ చేశారు....

RSS Chief Mohan Bhagwat: ‘హిందువుల్లేకుండా ఇండియా లేదు.. ఇండియా లేకుండా హిందువుల్లేరు’

Rss Mohan Bahgawat

Updated On : November 28, 2021 / 11:41 AM IST

RSS Chief Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ శనివారం సంచలన కామెంట్లు చేశారు. హిందువుల్లేకుండా ఇండియా లేదు.. ఇండియా లేకుండా హిందువుల్లేరని కామెంట్ చేశారు. దాంతో పాటు ఇండియాను హిందువులను వేరు చేయలేరని కామెంట్ చేశారు.

‘హిందువుల్లేకుండా ఇండియా లేదు. ఇండియా లేకుండా హిందువుల్లేరు’ అని మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జరిగిన వేదిక సందర్భంగా అన్నారు. ‘ఇండియా సొంత కాళ్లపై నిలబడుతుంది. అది హిందూత్వంలో ఉన్న గొప్పతనం. ఈ కారణంతోనే ఇండియా అనేది హిందువుల దేశం’ అని చెప్పారు.

విభజన తర్వాత భారత్ నుంచి విడిపోయి పాకిస్థాన్ ఏర్పడింది. హిందువులమనే భావన మరచిపోవడం వల్లే ఇలా జరిగింది. ఈ విషయాన్ని అక్కడి ముస్లింలు కూడా మరిచిపోయారు. మొదట హిందువులుగా భావించే వారి బలం తగ్గింది. తర్వాత వారి సంఖ్య తగ్గింది. అందుకే పాకిస్థాన్ ఇక భారత్‌లో లేదు’

…………………………………….. : ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది మృతి

‘హిందువుల సంఖ్య తగ్గిందా.. బలం తగ్గిందా లేక హిందుత్వ భావాలు తగ్గిపోయాయా అనేది మీకే కనిపిస్తుంది. హిందువులు హిందువులుగా ఉండాలంటే భారత్ ”అఖండ”గా మారాలి’ అని మోహన్ భాగవత్ అన్నారు.