బంగ్లాదేశ్‌లోని హిందువులకు అనుకూలంగా ప్రపంచ మద్దతును కూడగట్టాలి: కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఆర్‌ఎస్‌ఎస్
బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందూ మైనారిటీపై పెరుగుతున్న హింసను చూస్తూ నిశ్శబ్దంగా ఉందని ఆయన ఆరోపించారు.

Hindus in Bangladesh
బంగ్లాదేశ్‌లోని హిందువులకు అనుకూలంగా, వారిపై దాడులను అరికట్టేలా ప్రపంచ మద్దతును కూడబెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కోరింది. బంగ్లాదేశ్‌లో హిందువులు సహా ఇతర మైనార్టీలపై హింస పెరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దీనిపై ఆర్ఎస్‌ఎస్ స్పందించింది. హిందూ సాధువు, ఇస్కాన్ మాజీ నాయకుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను విడుదల చేయాలని ఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసను హోసబాలే ఖండించారు.
ముమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందూ మైనారిటీపై పెరుగుతున్న హింసను చూస్తూ నిశ్శబ్దంగా ఉందని ఆయన ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, మహిళలు, ఇతర మైనారిటీలందరిపై ఇస్లామిక్ ఛాందసవాదులు చేస్తున్న దాడులు, హత్యలు, దోపిడీలు, దహనం వంటి అమానవీయ ఘటనలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.
ఇలాంటి దురాగతాలను వెంటనే ఆపాలని, బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఈ పరిస్థితులను పరిష్కరించడానికి భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగించాలని హోసబాలే కోరారు. అంతర్జాతీయ మద్దతును కూడగట్టడానికి, మైనారిటీలను రక్షించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
TTD : తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే చట్టపరమైన చర్యలు- టీటీడీ వార్నింగ్