హింసాత్మకంగా కేరళ : కన్నూరులో బాంబ్ ఎటాక్స్

  • Published By: madhu ,Published On : January 6, 2019 / 03:54 AM IST
హింసాత్మకంగా కేరళ : కన్నూరులో బాంబ్ ఎటాక్స్

Updated On : January 6, 2019 / 3:54 AM IST

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలోని కన్నూరు అట్టుడుకుతోంది. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడంతో కేరళలో ఫుల్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పరిస్థితి అదుపు తప్పుతోంది. కన్నూరుతో పాటు, కోజికోడ్ డిస్ట్రిక్‌లలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. బీజేపీ, సీపీఎం నేతల, ఇళ్లు ఆస్తులపై బాంబు దాడులు జరగడం కలకలం రేగింది. 
సీపీఎం ఎమ్మెల్యే షంషీర్‌కు చెందిన మడపీడికయిల్‌లోని ఇంటిపై వడియిల్ పీడికియలోని బీజేపీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వి. మురళీధర్ పూర్వీకుల నివాసం..తలస్సేరిలోని సీపీఎం నేత శశి ఇంటిపై జనవరి 04వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులు వేశారు. పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు..సీపీఎం నేతల మధ్య దాడులు జరుగుతున్నాయి. 
కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అల్లర్లపై పోలీసు శాఖ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమౌతోంది. అల్లర్లకు సంబంధించి 1700 మందిని, కన్నూరులో మరో 260 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీపీఎం ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసమే హింసను ప్రేరేపిస్తోందని బీజేపీ అంటుంటే…దీనిని సీపీఎం తిప్పికొడుతోంది.