మేక్ ఇన్ ఇండియా : జవాన్ల కోసం త్వరలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు 

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే భారత ఆర్మీ సైనికుల భద్రత కోసం కొత్త బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు రాబోతున్నాయి.

  • Published By: sreehari ,Published On : October 5, 2019 / 12:02 PM IST
మేక్ ఇన్ ఇండియా : జవాన్ల కోసం త్వరలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు 

Updated On : October 5, 2019 / 12:02 PM IST

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే భారత ఆర్మీ సైనికుల భద్రత కోసం కొత్త బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు రాబోతున్నాయి.

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడే భారత సాయుధ దళాల భద్రత కోసం కొత్త బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు రాబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రోత్సాహంతో ‘మేక్ ఇన్ ఇండియా’ కింద బుల్లెట్ రిసిస్టంట్ జాకెట్లను భారత ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు సురక్షితమైనవి మాత్రమే కాదు.. ఎంతో తేలికైనవి. చౌకైన ధరకే స్వదేశంలోనే తయారీ చేస్తున్నట్టు చెప్పారు. 

నేషనల్ BIS ప్రమాణాలకు తగినట్టుగా ఈ బుల్లెట్ రిసిస్టెంట్ జాకెట్లను తయారు చేసినట్టు పాశ్వాన్ తెలిపారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) ప్రమాణాలతో బుల్లెట్ రిసిస్టెంట్ జాకెట్లను దేశంలో సూత్రీకరణ చేసినట్టు ఆయన చెప్పారు. ఇప్పటివరకూ అమెరికా, యూకే, జర్మనీ వంటి దేశాల్లో కూడా తమ ఆర్మీ సైనికుల కోసం తమ సొంత జాతీయ ప్రమాణాలతో కూడిన బుల్లెట్ రిసిస్టెంట్ జాకెట్లను తయారు చేస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించే దిశగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను జాతీయ ప్రమాణాలతో BIS రూపొందించింది. 

ఈ జాకెట్.. ప్రపంచంలోనే అత్యంత నైణ్యమైనది. బరువులో ఎంతో తేలికైనది. జవాన్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ జాకెట్లపై 50 శాతం తక్కువ ధరకే లభ్యం కానున్నాయి. తద్వారా ఈ జాకెట్లను మరింత ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది’ అని పాశ్వాన్ తెలిపారు. నీతి అయోగ్, కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ప్రమాణాన్ని సూత్రీకరించినట్టు ఆయన చెప్పారు. 

ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా పాశ్వాన్ ట్వీట్ చేశారు. ‘దేశీయ యుద్ధ సామాగ్రి తయారీ చేసే ఫ్యాక్టరీలు, ప్రైవేటు కంపెనీల సహకారంతో మేక్ ఇన్ ఇండియా కింద BIS ప్రామాణాలతో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను తయారు చేస్తున్నాం. ఆర్మీ, పార్లమెంటరీ బలగాలు, రాష్ట్ర పోలీసుల్లో డిమాండ్ మేరకు ఈ కొత్త బుల్లెట్ రిసిస్టెంట్ జాకెట్లను రూపొందిస్తున్నాం. 100 దేశాలకు కంటే పైగా వీటిని ఎగుమతి చేయనున్నాం. చిన్న ఆయుధాల నుంచి AK 47 రైఫిల్స్ వరకు సమర్థవంతంగా తట్టుకునేలా జాకెట్లను రూపొందించడం జరుగుతోంది’ అని పాశ్వాన్ ట్వీట్ చేశారు. 

ఈ జాకెట్ల బరువు 5.5 కిలోల నుంచి 10 కిలోల వరకు ఉంటుంది. ఇతర జాకెట్లతో పోలిస్తే సగానికి కంటే తక్కువగా ఉంటాయి. వెంటనే రిలీజ్ చేసేలా సిస్టమ్ ఏర్పాటై ఉంది. ఒక్కో జాకెట్ పై ధర రూ.70వేలు వరకు ఉంటుంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో పాటు CRPF, BSF, CISF, NSG బలగాల కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను భారతీయ ప్రమాణాలతో ఉత్పత్తి చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.