Samyukt Kisan Morcha: రైతుల రైల్ రోకో.. నిరసనలు తీవ్రతరం!

నేడు దేశవ్యాప్తంగా రైతుల రైల్ రోకోకు పిలుపిచ్చాయి రైతు సంఘాలు.

Samyukt Kisan Morcha: రైతుల రైల్ రోకో.. నిరసనలు తీవ్రతరం!

Kisan

Updated On : October 18, 2021 / 9:08 AM IST

Samyukt Kisan Morcha: నేడు దేశవ్యాప్తంగా రైతుల రైల్ రోకోకు పిలుపిచ్చాయి రైతు సంఘాలు. లఖింపూర్‌ ఖేరి ఘటనకు నిరసనగా రైల్ రోకోకి రైతు సంఘాలు పిలుపు ఇచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో కార్యక్రమం సాగనుంది. శాంతియుతంగా రైల్ రోకో చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.

అజయ్ మిశ్రాను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాలని, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘాలు. లఖింపూర్‌ ఖేరి ఘటన కేసులో అజయ్ మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణకు సహకరించకపోవడంతో అశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు పోలీసులు. అక్టోబర్ 3వ తేదీన లఖింపూర్‌ ఖేరిలో రైతులపై అశిష్ మిశ్రా కారు దూసుకెళ్లింది.

ఈ ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మృతి, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. లఖింపూర్ ఖేరీ విషయంలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రాని తొలగించాలని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లఖింపూర్ ఖేరీ కేసులో “న్యాయం జరిగే వరకు మాత్రమే నిరసనలు తీవ్రతరం చేస్తాం” అని సంయుక్త కిసాన్ మోర్చా చెబుతుంది.

ఉత్తరప్రదేశ్ అంతటా దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలలో, చాలా మంది రైతు నాయకులను గృహ నిర్బంధంలో ఉంచారని అదుపులోకి తీసుకున్నామని SKM పేర్కొంది. పౌరుల నిరసన హక్కును అణచివేయవద్దని కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిందని పేర్కొంది.