India China Border Dispute: భారత్ – చైనా సరిహద్దు వివాదం.. ప్రధాని మోదీపై సంజయ్ రౌత్ విమర్శలు

దేశ పాలకులు రాజకీయాలు, దర్యాప్తు వ్యవస్థ, అసెంబ్లీ, ప్రతిపక్ష పార్టీలపై దృష్టిసారించే బదులు సరిహద్దులపై దృష్టిసారించాలని శివసేన ఎంపీ సంజయ్ అన్నారు.

India China Border Dispute: భారత్ – చైనా సరిహద్దు వివాదం.. ప్రధాని మోదీపై సంజయ్ రౌత్ విమర్శలు

Sunjay Routh

Updated On : December 13, 2022 / 1:03 PM IST

India China Border Dispute: తవాంగ్‌లో జరిగిన ఘటనతో ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి నిరంతరం ఏదో ఒక విషయాన్ని దేశం నుంచి దాచేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. శుక్రవారం తవాంగ్‌లో ఘర్షణ జరిగిన విషయంపై ప్రభుత్వం అధికారికంగా ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు.

Indians at China Border: చైనా సరిహద్దుకు 50వేల మంది సైనికులను పంపిన ఇండియా!

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లడఖ్, డోక్లామ్ తరువాత చైనా సైనికులు ప్రస్తుతం తవాంగ్ లోకి ప్రవేశిస్తున్నారని, అయితే, దేశ పాలకులు రాజకీయాలు, దర్యాప్తు వ్యవస్థ, అసెంబ్లీ, ప్రతిపక్ష పార్టీలపై దృష్టిసారించే బదులు సరిహద్దులపై దృష్టిసారించాలని కేంద్రం తీరుపై విమర్శలు చేశారు.  చైనా వంటి శత్రువు మూడు వైపుల నుండి ప్రవేశిస్తున్నాడు, మనం అక్కడ దృష్టిసారిస్తే అది నిజంగా దేశానికి మేలు చేస్తుందని సంజయ్ అన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ప్రవేశించడం ఇదే తొలిసారి కాదు. చైనా ఎప్పుడూ అరుణాచల్ ప్రదేశ్ ను మ్యాప్ లో తమ భూభాగంలో చూపుతోంది. ప్రభుత్వం మరింత జాగ్రత్తగా పని చేయాల్సి ఉందని, అయితే అది జరిగేలా కనిపించడం లేదని సంజయ్ రౌత్ అన్నారు.