సేవ్ సుజీత్ : బోరుబావిలో పడిన చిన్నారి క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థించిన రాహుల్

తమిళనాడులోని తిరుచ్చిరాపల్లి జిల్లాలోని మనప్పారై లోని 110 అడుగుల ఓ బోరు బావిలో పడ్డ రెండేళ్ల బాలుడు సుజీత్ క్షేమంగా తిరిగి రావాలని దేశమంతా ఎదురుచూస్తోంది. సుజీత్ క్షేమంగా తిరిగి రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. దేశం దీపావళిని జరుపుకుంటుండగా, తమిళనాడులో 72 గంటలకు పైగా బోర్‌వెల్‌లో చిక్కుకున్న శిశువు సుర్జీత్‌ను రక్షించడానికి సమయానికి వ్యతిరేకంగా రేసు జరుగుతోంది. అతను త్వరగా రక్షించబడాలని,కలత చెందిన తన తల్లిదండ్రులను తిరిగి కలుసుకోవాలని తాను ప్రార్థిస్తున్నాను అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
అక్టోబరు 25 సాయంత్రం ఇంటి దగ్గర ఆడుకుంటూ ప్రమాద వశాత్తు బాలుడు నిరుపయోగంగా ఉన్న మూతలేని బోరు బావిలో పడిపోయాడు. మొదట బాలుడు 35 అఢుగుల లోతులోనే ఉన్నాడని భావించినప్పటికీ 110 అడుగుల కిందకు జారిపోయినట్లు రెస్క్యూ టీమ్ చెప్పారు. బారు బావిలోకి ఆక్సిజన్ పంపిస్తూ బాలుడిని బయటకు తీసేందుకు NDRF,SDRF సిబ్బంది కృషి చేస్తున్నారు.
సహాయక చర్యల్లో భాగంగా ప్రస్తుతం ONGC యంత్రంతో బోర్ వెల్ దగ్గర ఓ రంధ్రం చేస్తున్నారు. ఆ రంధ్రం ద్వారా రెస్క్యూ సిబ్బంది సొరంగంలోకి దిగి రదలో ఉన్న బాలుడి దగ్గరకు చేరుకుని బాలుడిని సేఫ్ గా బయటకు తీసుకొస్తారు. సుజీత్ క్షేమంగా రావాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.