SBI : ఎస్‌‌బీఐ కస్టమర్లు అలర్ట్…శనివారం నిలిచిపోనున్న ఆన్ లైన్ సేవలు

జనవరి 22వ తేదీ శనివారం ఆన్ లైన్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయని...బ్యాంకు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది...

SBI : ఎస్‌‌బీఐ కస్టమర్లు అలర్ట్…శనివారం నిలిచిపోనున్న ఆన్ లైన్ సేవలు

Sbi

Updated On : January 21, 2022 / 8:39 PM IST

SBI Internet Banking Services : దేశీయ అతిపెద్ద బ్యాంకు ఎస్ బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వినియోగదారులకు ఒక ముఖ్య గమనిక. ఆన్ లైన్ బ్యాంకింగ్ నిర్వహిస్తున్న వారికి కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది. 2022, జనవరి 22వ తేదీ శనివారం ఆన్ లైన్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయని…బ్యాంకు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Read More : Cyber Crime Arrest: సీఎంను చంపుతానంటూ పోస్ట్.. జనసేన సపోర్టర్ అరెస్ట్!

టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా…జనవరి 22వ తేదీ 2 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ సేవలు పని చేయవంటూ..అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. గత కొంతకాలంగా టెక్నాలజీ అప్ గ్రేడేషన్ ప్రక్రియను ఎస్ బీఐ చేపట్టిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 22 వేళ శాఖలు, 57 వేల 889 ఏటీఎం కేంద్రాలు దీనికి ఉన్నాయి. గత సంవత్సరం డిసెంబర్ నెలలో కూడా అప్ గ్రేడేషన్ ప్రక్రియను చేపట్టగా..కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి.