SBI : ఏటీఎం కార్డు లేకుండా అన్ని ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోవచ్చు .. ఎలాగంటే..

ఇకనుంచి ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినాసరే కార్డు లేకపోయినా క్యాష్ తీసుకోవచ్చు. ఎస్బీఐ ఖాతాదారులు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశాన్ని కల్పించింది. స్కాన్ చేయండి..క్యాష్ తీస్కోండి..

SBI : ఏటీఎం కార్డు లేకుండా అన్ని ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోవచ్చు .. ఎలాగంటే..

SBI YONO App .. Cardless Cash Withdrawal

Updated On : July 4, 2023 / 3:25 PM IST

SBI YONO APP : సాధారణంగా ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే కార్డు ఉండాల్సిందే. డెబిట్ కార్డు ((Debit Card) ఉంటేనే ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోగలం. కానీ భారత్ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (State Bank of India)తమ ఖాతాదారులకు పలు నూతన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో కార్డు లేకుండానే ఏటీఎం నుంచి క్యాష్ తీసుకునే సౌకర్యాన్ని కలిగిస్తోంది. అంటే కార్డ్ లెస్ కార్డ్ విత్ డ్రా(Cardless Cash Withdrawal) అన్నమాట. ఈ కొత్త సౌకర్యంలో భాగంగా ఇకనుంచి ఏ బ్యాంకు ఏటీఎం నుంచి అయినాసరే కార్డు లేకపోయినా క్యాష్ తీసుకోవచ్చు. ఎస్బీఐ ఖాతాదారులు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటిదాకా ఇటువంటి సదుపాయం కేవలం ఎస్బీఐ (SBI)ఏటీఎం (ATM)లలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఎస్బీఐ కొత్తగా అందించే సదుపాయంలో భాగంగా ఇక అన్ని ఏటీఎంలకు దీన్ని విస్తరిస్తూ బ్యాంక్‌ యాప్‌ ‘యోనో’(YONO)ను అప్‌గ్రేడ్‌ చేసింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India ), 68వ బ్యాంక్ డే వేడుకల్లో (68th Bank Day celebrations)భాగంగా.. మెరుగైన డిజిటల్ బ్యాంకింగ్ అప్లికేషన్(digital banking application), ‘యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్'(‘YONO for Every Indian’),ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్ (Interoperable Cardless Cash Withdrawal (ICCW) సౌకర్యాలను ప్రారంభించింది.

ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా యూపీఐ లావాదేవీల కోసం ‘యోనో యాప్’(YONO App)ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా యూపీఐ లావాదేవీల కోసం యోనో యాప్‌ను వాడుకునేలా ఎస్బీఐ మార్పులు చేసింది. ఇందుకోసం ‘యోనో ఫర్‌ ఎవ్రీ ఇండియన్‌’(‘YONO for Every Indian’)థీమ్‌ను తీసుకొచ్చింది. ఏ బ్యాంకు కస్టమర్ అయినా స్కాన్‌(Scan ), పే(Pay), పే బై కాంటాక్ట్స్(Pay by contacts)‌, రిక్వెస్ట్‌ మనీ (Request money)వంటి సదుపాయాలు దీనిలో ఉంటాయని ఎస్బీఐ(SBI)వివరించింది.

ఎస్‌బీఐ కార్డ్‌లెస్ (Cardless Cash Withdrawal)యూపీఐ ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్ సర్వీసులు (UPI ATM Cash Withdrawal Services) అందుబాటులోకి తీసుకురావటంతో ఇది వినియోగదారులకు మంచి సౌకర్యంగా ఉండనుంది. ఇంటర్ ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్ (ICCW)ఫెసిలిటీ లాంచ్ చేయటంతో ఎవరైనాసరే యూపీఐ యాప్ (UPI App) ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏటీఎం నుంచి డబ్బలు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏటీఎం పిన్ వంటి వాటితో పని లేదు. దీని వల్ల ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ మరింత ఈజీ అవుతాయని చెప్పుకోవచ్చు.

ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్ కోడ్ (QR code)కనిపిస్తుంది. దీన్ని మీ ఫోన్‌తో స్కాన్ చేయాలి. ఏటీఎం (ATM)నుంచి డబ్బులు వచ్చేస్తాయి. ఫోన్‌లో యూపీఐ యాప్స్‌లో స్కాన్ అండ్ పే ఆప్షన్ (Scan and pay option)ఉంటుంది. దీని ద్వారా మీరు ఏటీఎం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ యోనో యాప్‌ (SBI YONO App)లో కూడా స్కాన్ అండ్ పే ఆప్షన్ (Scan and pay option)ఉంటుంది. అంటే ఈ యాప్ ద్వారా కూడా మీరు ఈజీగా యూపీఐ విధానంలో ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.