రూ.30 లక్షల ఇన్సూరెన్స్ కూడా : అమర జవాన్ల రుణాలు మాఫీ

  • Published By: venkaiahnaidu ,Published On : February 18, 2019 / 03:41 PM IST
రూ.30 లక్షల ఇన్సూరెన్స్ కూడా : అమర జవాన్ల రుణాలు మాఫీ

Updated On : February 18, 2019 / 3:41 PM IST

పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లలో 23 మంది రుణాలను పూర్తిగా రుఫీ చేస్తున్నట్లు SBI ప్రకటించింది. అంతేకాకుండా SBIఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని కోరింది. దీని కోసం ఎస్ బీఐ యూపీఐని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత్ కే వీర్ కు తమ వంతు సాయం చేస్తామని తెలిపింది. బయటివ్యక్తులు కూడా విరాళం అందిచాలనుకుంటే బ్యాంకు వర్గాలను సంప్రదించాలని సూచించింది.అంతేకాకుండా అమరులైన జవాన్ల ఒక్కొక్కరి కుటుంబానికి  రూ.30 లక్షల ఇన్సూరెన్స్ ఎస్ బీఐ విడుదల చేయనుంది. ఉగ్రదాడిలో అమరులైన జవాన్లందరూ ఎస్బీఐ ఖాతాదారులు. వారికి శాలరీ ఈ అకౌంట్ నుంచే అందుతోంది.