ఉరి ఖాయం : నిర్భయ దోషి క్యురేటివ్ పిటిషన్ కొట్టివేత
నిర్భయ(Nirbhaya) దోషుల ఉరి శిక్షకు అడ్డంకులు తొలిగాయి. వారిని ఈసారి ఉరి(hang) తీయడం ఖాయమైంది. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు

నిర్భయ(Nirbhaya) దోషుల ఉరి శిక్షకు అడ్డంకులు తొలిగాయి. వారిని ఈసారి ఉరి(hang) తీయడం ఖాయమైంది. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు
నిర్భయ(Nirbhaya) దోషుల ఉరి శిక్షకు అడ్డంకులు తొలిగాయి. వారిని ఈసారి ఉరి(hang) తీయడం ఖాయమైంది. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను తీహార్ జైల్లో(Tihar) ఉరి తీయనున్నారు. నిర్భయ దోషి అక్షయ్ కుమార్ సింగ్ వేసుకున్న క్యురేటివ్ పిటిషన్(curative petition) ను గురువారం(జనవరి 30,2020) సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ క్యురేటివ్ పిటిషన్ పై విచారణ జరిపింది. పిటిషన్ కొట్టివేసింది. మహిళలపై హింసకు సంబంధించిన కేసుల్లో ప్రజల నుంచి ఎదురయ్యే ఒత్తిడి, ప్రజాభిప్రాయాలను అనుసరించి కోర్టులు సర్వరోగ నివారిణిగా దోషులకు మరణశిక్ష విధిస్తున్నాయని అక్షయ్ తన క్యురేటివ్ పిటిషన్ లో చెప్పాడు.
నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఇటీవల రెండోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో శిక్ష అమలును ఆపేందుకు దోషులు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారు. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి, ఉరి తేదీని మరింత ఆలస్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు వేస్తూ.. ఉరి తేదీని పొడిగిస్తున్నారు. ఇప్పటికే ఉరి తేదీ రెండుసార్లు వాయిదా పడింది.
ఇందులో భాగంగానే నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్.. బుధవారం(జనవరి 29,2020) క్యురేటివ్ పిటిషన్ వేశాడు. దీనిపై గురువారం(జనవరి 30,2020) విచారణ జరిపిన కోర్టు.. దాన్ని కొట్టేసింది. ఉరిశిక్షను సవాల్ చేస్తూ అక్షయ్ కుమార్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ కొట్టివేయడంతో క్యురేటివ్ పిటిషన్ వేశాడు. ఇక మరో దోషి వినయ్ శర్మ క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ దాఖలు చేశాడు. తనకు విధించిన మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని విజ్ఞప్తి చేశాడు.
2012లో నిర్భయపై ముకేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్భయను తీవ్రంగా గాయపరిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిర్భయ చనిపోయింది. నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1 ఉరి ఖరారైంది. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ హైకోర్టు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది. నిర్భయ దోషులకు ఉరి శిక్ష విధిస్తూ పటియాల కోర్టు జనవరి 22న తీర్పు ఇచ్చింది. అయితే… ముకేష్ క్షమాభిక్ష పిటిషన్ తో ఉరిశిక్ష ఆలస్యమైంది.